వైరా.. ఏపీ స‌రిహ‌ద్దు జిల్లా అయిన ఖమ్మంలో ఎస్టీ వ‌ర్గానికి కేటాయించిన అసెంబ్లీ నియ‌జక వ‌ర్గం. అయితే, ఇప్పుడు ఈ సీటు వివాదంగా మారింది. కేసీఆర్‌ను ఓడించాల‌నే ధ్యేయంతో కూట‌మి గ‌ట్టిన మ‌హాకూట‌మిలో ఈ సీటు వివాదం ర‌గులు తోంది. ఈ నియోజకవర్గం నుంచి ఎవ‌రు పోటీ చేయాల‌నే మహా కూటమిలో ఇంకా చిక్కుముడి వీడలేదు. ఈ నియోజ కవర్గం మాదంటే మాదే... పోటీ చేసేదీ మేమంటే మేమే అంటూ కాంగ్రెస్‌, సీపీఐలు కుస్తీపడుతు న్నాయి. మహాకూటమి ఏర్పడి సీట్ల పంపకాల కోసం ఓ వైపున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైరా నియోజకవర్గంలో మాత్రం ఈ రెండు పార్టీలు చెరో దారిలో పయనిస్తున్నాయి. ఈ రెండు పార్టీల బలాలను బేరీజు వేసుకున్నప్పుడు కాంగ్రెస్‌కు సీపీఐకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. 

ఆది నుంచి కూడా ఖ‌మ్మ జిల్లాలో కాంగ్రెస్‌కు కంచుకోట వంటి నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వైరాలో కాంగ్రె స్‌ బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండగా సీపీఐ నామమాత్ర ఓటుబ్యాంకుతో ఉందని అంటున్నారు నాయ‌కులు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ పోటీచేసి తీరుతుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం నియోజక వర్గాలను ఎట్టిపరిస్థితుల్లో వదులుకొనేది లేదని సీపీఐ  చెపుతుంది.  గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ నియోజక వర్గంలో జనం కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టేందుకు గానూ సిద్ధమై తమ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలని ప్రతీ ఒక్కరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని, ప్రజల్లో ఊహించనంత ఆదరణ ఉందని  కాంగ్రెస్ నాయ‌కులు అంటున్నారు. 

అంతేకాదు, ఈ విష‌యాన్ని గుర్తించి..  సీపీఐ పోటీ విషయంలో ప్రతిష్టకు పోకుండా మహా కూటమి అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ తమకు సహకరించాలని కాంగ్రెస్‌ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రం మొ త్తం మీద తాము అడిగే సీట్లు సింగిల్ డిజిట్‌గానే ఉన్నాయని అలాంటి వైరా కూడా ఒకటని, మహాకూటమి గెలుపే లక్ష్యంగా తమకు సహకరించాలని సీపీఐ కోరుతుంది. అంతేకాదు.. అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా కూడా ప‌దునైన వ్యాఖ్య‌లు చేసింది. ఒకవేళ మహాకూటమి పొత్తులు విచ్ఛిన్నమైతే అందుకు కాంగ్రెస్సే కారణమని ఉమ్మడి జిల్లాల్లో పదిసీట్లలో పోటీచేస్తామని సీపీఐ హెచ్చరిం చింది. మ‌రి ఈ ప‌రిస్థితిలో మ‌హాకూట‌మి ఎలా ముందుకు వెళ్తుంద‌ని అంటున్నారు టీఆర్ ఎస్ నేత‌లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా వైరా మాత్రం కూట‌మిలో చిచ్చు పెట్టింది. 

మ‌హా కూట‌మిలో 

మరింత సమాచారం తెలుసుకోండి: