రాజ‌కీయాల్లో నాయ‌కులను మ‌చ్చిక చేసుకోవాల‌న్నా.. నాయ‌కులను అదుపు చేయాలన్నా.. కాంగ్రెస్‌కు కొట్టిన పిండి! ఎక్క డ ఎవ‌రిని పైకెత్తాలో? ఎక్క‌డ ఎవ‌రిని కిందికి దించాలో?  తెలిసిన పార్టీగా కాంగ్రెస్ దేశ‌వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇదే స‌మ‌యంలో తెలంగాణాలోనూ ఇదే విదానం ఇప్పుడు అవ‌లంబిస్తోంది. ఇక్క‌డ బీజేపీ, టీఆర్ ఎస్ ఏత‌ర పార్టీల‌త క‌లిసి మ‌హాకూట‌మిగా జ‌ట్టుక‌ట్టింది. అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే లెక్క‌లు వేసుకుంది. దీనికి త‌న బ‌లంతోపాటు.. టీడీపీ, వామ‌ప‌క్షాలు, తాజా పొద్దులో వెలుగుచూసిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం పార్టీ తెలంగాణ జ‌న‌స‌మితిని కూడా కాంగ్రెస్ త‌న ఖాతాలో క‌లుపుకుని మ‌హాకూట‌మికి తెర‌దీసింది. 117 సీట్లలో మేజ‌ర్ స్థానాలు త‌న వ‌ద్ద పెట్టుకుని మిగిలిన‌వాటిని కూట‌మి మిత్రుల‌కు క‌ట్ట‌బెడుతోంది. 


అయితే, అనూహ్యంగా తెలంగాణా జ‌న‌స‌మితి నాయ‌కుడు కోదండ‌రామ్‌కు ప్రాధాన్యం పెంచుతోంది కాంగ్రెస్‌. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వచ్చాక.. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌కు డిప్యూటీ సీఎం హోదాతో కూడిన పదవిని కట్టబెట్టాలని కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌ యోచిస్తోంది. మహాకూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమ లుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి.. దానికి కోదండరాంను అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తోంది. దీంతో పాటు కోదండరాం ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి తరఫున ప్రచారం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు సమాచారం. కోర్‌ కమిటీ సభ్యులు మరో అడుగు ముందుకేసి.. టీజేఎ్‌సకు టికెట్లు కేటాయించినా ఆ అభ్యర్థు లు కాంగ్రెస్‌ గుర్తుపైనే పోటీచేస్తే బాగుంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 


దీనికి ప్ర‌త్యేకంగా ఓ కార‌ణం ఉంద‌ని అంటున్నారు. కొత్త గుర్తు ఉంటే ప్రజలు అయోమయానికి గురవుతారని కొందరు నేత లు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వ‌డం అంటే.. ప్రొఫెస‌ర్‌ను కాంగ్రెస్ నెత్తిన పెట్టు కుంటున్న‌ట్టే అంటున్నారు. అయితే, ఆయ‌న ఏ మాత్రం ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌నే విష‌యం చ‌ర్చ‌కు వ స్తోంది. నిజానికి ఆయ‌న వెంట విద్యార్థులు, మేదావులు ఉండాల్సి ఉంది. ఇలా ఉంటార‌ని కూడా అంద‌రూ భావించారు. అయితే, ఆయ‌న అనుస‌రిస్తున్న వైఖ‌రి కార‌ణంగా ఆయ‌న‌కు ఈ వ‌ర్గాలు దూర‌మ‌య్యాయి. తెలంగాణ ద్రోహి పార్టీగా ముద్ర‌ప‌డిన టీడీపీతో క‌లిసిన మ‌హాకూట‌మిలో కోదండ‌రాం చేర‌డాన్ని వారు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొంత వ్య‌తిరేక గాలులు వీస్తున్నాయి. అయినా.. హైద‌రాబాద్ ప‌రిధిలోని యూనివ‌ర్సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే కోదండ రాం ప్ర‌భావం క‌నిపిస్తోంది. మ‌రి కాంగ్రెస్ వ్యూహం ఏమిట‌న్న‌ది తేలాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: