తనకు ఎదురు తిరిగినా, ఎదురు తిరగాలన్న ఆలోచన వచ్చినా వారిని పాతాళంలోకి తొక్కేయడం మోడీ స్టయిల్. మహా మహా అద్వానీలాంటి వాళ్లనే బలవంతంగా రిటైర్మెంట్ చేయించాడు, వెంకయ్యనాయుడుపై అదురుదెబ్బ వేసి సైడ్ ట్రాక్ లోకి నెట్టేశాడు. అలాంటి మోడీకి చంద్రబాబు ఓ లెక్కా. ప్రత్యేకహోదా పేరుతో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని నానా యాగీ చేయడం, కేంద్రం సహకరించడం లేదని ప్రచారం చేయడం, మోదీ కంటే నేనే సీనియర్ అంటూ దెప్పిపొడవడం.. ఇవన్నీ అక్కడ రికార్డ్ అయిపోయాయి. వీటిపై చిన్నగా రియాక్షన్ మొదలైంది. ఐటీ దాడుల పేరుతో చంద్రబాబు క్యాష్ టీమ్ పై జరుగుతున్న దాడులు జస్ట్ శాంపిల్ మాత్రమే.

Image result for chandrababu naidu

నిన్నటితో ఐటీ రైడ్స్ ముగిశాయని టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు. వీటికి భయపడటం లేదని మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మోడీని ముందుంచి తెరవెనక అమిత్ షా రివేంజ్ డ్రామాని రక్తికట్టించే పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన కొన్ని కుంభకోణాల్ని కేంద్రం బయటపెట్టబోతోందని తెలుస్తోంది.

Image result for chandrababu naidu

పోలవరం ప్రాజెక్టు, రాజధాని ఒప్పందాలు, భూసేకరణలో జరిగిన అవినీతి, తాత్కాలిక నిర్మాణాల పేరుతో జరిగిన దోపిడీ, రుణమాఫీ పథకాల్లో లొసుగులు, అమరావతి బాండ్లు.. ఒకటేంటి, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి బండారాన్నంతా బయట పెట్టేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.ఇవన్నీ ఒక ఎత్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతి మరో ఎత్తు. ఇది భారీ కుంభకోణం అంటూ ఉండవల్లి వంటి నేతలు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. దీనితో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా కేంద్రం దృష్టిసారించింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు జరిగిన ఐటీ దాడులు జస్ట్ ట్రైలర్ మాత్రమే అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: