భారత దేశంలో భగవంతుడు అంటే ఎంత భక్తితో పూజిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఎంతో మంది భక్తి శ్రద్ధలతో కొలిచే షిర్డీ సాయిబాబా మహాసమాధి చెంది నేటితో వందేళ్లు పూర్తయ్యాయి.  సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు.  1918 అక్టోబర్ 15వ తేదీన ఆయన సమాధి అయ్యారు. షిర్డీలో దాదాపు 60 ఏళ్ల పాటు సాయిబాబా నివసించారు.

సాయిబాబా హిందూ, ఇస్లాం రెండు సంప్రదాయాలను పాటించారు. నమాజ్ చదవడం, ఖురాన్ ను అధ్యయనం చేయడం వంటి ఆచారాలను ప్రోత్సహించారు.   భగవద్గీత, రామాయణం, విష్ణు సహస్రనామ స్త్రోత్రాలను పారాయణం చేయాలని హిందువులకు సూచించారు.  ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు. 
Shirdi Sai Baba.jpg
సాయిబాబాకు దేశంలోనే కాకుండా దాదాపు 50 దేశాల్లో 8వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. మన దేశంలో పద్మనాభస్వామి ఆలయం, తిరుమల తర్వాత అత్యంత సంపన్నమైన ఆయలం షిర్డీ సాయిబాబాదే. సాయి సంస్థాన్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1800 కోట్ల సొమ్ము ఉంది.  సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి.సాయిబాబాకు దేశంలోనే కాకుండా దాదాపు 50 దేశాల్లో 8వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. మన దేశంలో పద్మనాభస్వామి ఆలయం, తిరుమల తర్వాత అత్యంత సంపన్నమైన ఆయలం షిర్డీ సాయిబాబాదే. సాయి సంస్థాన్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1800 కోట్ల సొమ్ము ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: