జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో ధవలేశ్వరం బ్రిడ్జి పై పార్టీ తరపున చేసిన కవాతు ప్రోగ్రాం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టించింది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆయన కుమారుడు లోకేష్ పై సెటైర్లు వేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Image result for జనసేన కవాతు

2014 ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తల ఓట్లు కొల్లగొట్టే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జనసేన పార్టీ తరపున జరుగుతున్న కవాతు ప్రోగ్రాం కి అధికారాన్ని ఉపయోగించి అనేక అడ్డంకులు సృస్టించారని చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు పవన్.

Image result for చింతమనేని ప్రభాకర్ పవన్ కళ్యాణ్

ఇదే క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై విరుచుకు పడిన పవన్ కళ్యాణ్ మరొకసారి..కవాతు కార్యక్రమంలో కూడా చింతమనేని ప్రభాకర్ పై విరుచుకు పడ్డారు. ఒక ఆకు రౌడీ వీధి రౌడీ అయినా చింతమనేని ప్రజలను కులాల పేర్లతో దూషిస్తూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

Related image

ముందుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీస్ స్టేషన్ లో ఉన్న ఫైల్ అన్ని బయటకు తీసి అతని కేసులపై విచారించాలని డిమాండ్ చేశారు పవన్. ఇటువంటి దారుణమైన విత్ వన్ కలిగిన మనుషులను ప్రజాస్వామ్యంలో కి తీసుకొచ్చి వారికి అండగా నిలబడి చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని విమర్శించారు పవన్.




మరింత సమాచారం తెలుసుకోండి: