తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆయన కుమారుడు లోకేష్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున నిర్వహించిన కవాతు ప్రోగ్రాంలో ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సంచలన కామెంట్ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కనీసం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా కూడా గెలవని వ్యక్తి అని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేస్తూ మాట్లాడారు.

 జనసేన కవాతులో పాల్గొన్న కార్యకర్తలు

ఏం తెలుసని నారా లోకేష్ ని ఆ స్థానంలో కూర్చోబెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రశ్నించారు పవన్. మీ అనుభవం మీ కొడుకు నారా లోకేష్ కి వస్తుందని కూర్చోబెట్టారా...అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించారు పవన్. సినీ యాక్టర్ కి ప్రజా సమస్యల గురించి ఏం తెలుస్తుందని ఇటీవల సెటైర్లు వేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Image result for pawan kalyan lokesh

14 సంవత్సరాల వయసులోనే తాను సమాజం కోసం దేశం కోసం సేవ చేయాలనే కోరికతో ఉన్నానని ఆ విషయం తన తల్లిదండ్రులకు తెలియని తన అన్నయ్య చిరంజీవికి తెలియదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మాట్లాడితే పవన్ సినీ యాక్టర్ అని అంటుంటారని రాజకీయాలను అర్థం చేసుకొనే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ కు ఏం తెలుసని మంత్రిని చేశారని పవన్ అన్నారు. పంచాయితీ  ఎన్నికల్లో గెలవని వ్యక్తిని...పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఎలా చేశారని ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తులను చట్టసభల్లో కూర్చోబెట్టి రాష్ట్రాన్ని ఎం ఉద్ధరిదమని అనుకుంటున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.

 జనసేన కవాతులో పాల్గొన్న పవన్ కళ్యాణ్

ఇందుకోసం నేను 2014 ఎన్నికల్లో మీకు మద్దతు తెలిపినా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో నారా లోకేష్ పై పవన్ కళ్యాణ్ వేసిన సర్పంచ్ సెటైర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరోపక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని చాలా మంది నెటిజన్లు పేర్కొంటున్నారు..ప్రజా సమస్యలపై అవగాహన లేని వ్యక్తి చట్టసభలలో వస్తే ఎలా ఉంటుంది అన్న ఉదాహరణకు నారా లోకేష్ వ్యవహరించే తీరే నిదర్శనమని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.




మరింత సమాచారం తెలుసుకోండి: