ధవళేశ్వరం బారేజ్ పై కవాతు తరవాత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఒక రేంజ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి లోకెష్ పై విరుచుకుపడ్డారు. వారసత్వ మంత్రిత్వం, ముఖ్యమంత్రిత్వాన్ని చీల్చి చెండాడారు. సోమవారం కవాతు అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభిమానులు సీఎం.. సీఎం అని నినాదాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నాకు సీఎం పదవి అలంకారం కాదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు వాగ్ధానాలు ఆపై నిర్లక్ష్యాన్ని, బాధ్యత లేమిని ఎండగట్టారు.


అలాగే లోకేష్, వైసీపీ అధినేత వైయస్ జగన్‌లా తనకు వారసత్వం కాదని చెప్పారు. మీ మాట విశ్వంలోకి వెళ్తుందని, అది సత్యం అవుతుందన్నారు. తాను పార్టీని సమాజ ప్రయోజనాల కోసం పెట్టానని చెప్పారు. తాను ఏ పని చేసినా త్రికరణశుద్ధితో చేస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు.

Related image

పవర్ఫుల్ పంచ్‌లు, అధికార పార్టీకి చురకలు, ప్రతి పక్షపార్టీలకు హెచ్చరికలతో ఆవేశపూరిత ప్రసంగంతో జనసైనికుల్లో ఉత్సాహం నింపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తూర్పు గోదావరి జిల్లా పిచుకల్లంక నుంచి సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వరకు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా నిర్వహించిన కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి, ఆయన కొడుకు లోకేష్‌ పై నిప్పులు కురిపించారు.


నాకు ముఖ్యమంత్రి పదవి నాకు అలంకారం కాదు. చంద్రబాబు, లోకేష్‌, జగన్ లాగా వారసత్వం లేదు. కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టా! మా తాత పోస్ట్‌ మేన్. మాది చిన్న జీవితం. పోస్ట్ మేన్ మనవడు, కానిస్టేబుల్ కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు? ఖచ్చితంగా అవుతాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా ఉద్యోగులకు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా వారికి అండగా ఉంటానని చెప్పారు.lవారసత్వంతో ముఖ్యమంత్రి కాలేరు. బలం, శక్తి, పోరాటం చేయగలికే సత్తా, భావజాలం ఉందని చెప్పారు. నాకు దశాబ్ధం పాటు రాజకీయ అనుభవం ఉంది. ఇది మూడో ఎలక్షన్.

Image result for pavan kalyan from dhavaleswaram barrage

ఈ అనుభవం లో ఎన్నో దెబ్బలు తిన్నాం. మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. చేయని తప్పుకి నెలలుగా అవమానాలు ఎదుర్కొన్నాం. భంగపడ్డాం. 2014లో నేను మీకు మద్దతు ఇస్తే మీరు నన్ను, మా అమ్మను తిట్టిస్తారా? అని తెలుగుదేశం పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. మమ్మల్ని తిట్టినా భరిస్తామని, సహిస్తామని, పడ్డాం! అవమానాలు సహించాం! ఎందుకు పడ్డాం? ఎందుకు సహించాం? పౌరుషం లేదా? మాకు. ఉప్పు కారం తినలేదా మేం. మాకు అవమానాలు జరగవా? పౌరుషాలు ఉండవా? ఆకాశం లో నుండి ఊడి పడ్డారా? మీరు. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. ఎక్కువ చేస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరించారు తేడా లొస్తే  తాట తీస్తాం.


"రెండు కోట్లఉద్యోగాలు ఇస్తానన్నారు. బాబు వస్తే జాబు ఇస్తాం అన్నారు. ఈ మధ్య పలాసలో రోడ్డు పక్కన ఒకతన్ని అడిగా! బాబు వస్తే జాబు ఇస్తాం! అన్నారు ఏమైంది? అని, ఆ పెద్దాయన ఒకటే అన్నారు. జీలకర్రలో కర్ర లేదు. నేతి బీరకాయలో నెయ్యి లేదు. బాబు జేబులో జాబు లేదు అన్నారు. దీన్ని బట్టి చంద్రబాబు పాలన ఎలా ఉందో? జనం ఏమను కుంటున్నారో? అర్ధ మౌతోంది.

Image result for pavan kalyan from dhavaleswaram barrage

మీ విలాసాల కోసం ఏమైనా చేసుకోండి. మాకు అభ్యంతరం లేదు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. ఎన్ని పథకాలు పెట్టారు. విదేశాలకు వెళ్ళి బిల్ గేట్స్‌ని కలవడం కాదు. సగటు మనిషి కష్టాలు చూడండి. అందుకే జనసేన అధికారంలోకి వస్తే, చిన్న కార్మికులకు అండగా నిలబడతాం. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా దోపిడీలే. జన్మభూమి కమిటీలా? దోపిడీ కమిటీలా?  జనాలకు ఏమీ అర్ధం కావడం లేదు. చంద్రబాబు గారు! మళ్లీ మీరే రావాలని విజయవాడ లో హోర్డింగ్స్ కనిపించాయి. వచ్చి ఏం చేస్తారు? 


రాజమండ్రి నుండి చంద్రబాబుకి లోకేష్‌కి చెబుతున్నా! 14 ఏళ్ల వయస్సులో నిర్ణయించుకున్నా!  మా అన్నయ్యకి తెలియదు. అమ్మకి నాన్నకి ఏమీ తెలియదు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్,  సినిమా యాక్టర్ అంటారు. అరె మీ లోకేష్‌కి ఏం తెలుసు. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ని చేశారే మీరు. ఆయనకు ఏం తెలుసు?

Image result for pavan kalyan from dhavaleswaram barrage

ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకుకి రావాలి. వారసత్వం అంటే ఏంటి? ఇంటిపేరు? ఆస్తులు అంతస్తులు వస్తాయి. ప్రజాపాలనలో పదవులు కాదు! మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేసేందుకా? జనసేన మీకు సపోర్ట్ చేసింది అంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్. అన్నా హజారేలా, అరవింద్ కేజ్రీవాల్‌ వలె పెద్ద పెద్ద విలువల గురించి మాట్లాడనని చెప్పారు. 2014లో చంద్రబాబు కు గెలుస్తాననే నమ్మకం లేదని చెప్పారు. జగన్ సీఎం అయితే అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పారని తెలిపారు. దోపిడీ వ్యక్తులను ఎదుర్కొనే ధైర్యం పవన్‌కు, జగన్‌కు ఉందని చెప్పారు.

ఓ పోస్ట్‌మాన్ మనవడి, కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ

వ్యవస్థలో మార్పు రావాలంటే మూలాల నుంచి ప్రారంభం కావాలని పవన్ చెప్పారు. టీడీపీ పంచాయతీ ఎన్నికలు పెడితే మా సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ చేశారు. సమయం అయిపోయినా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అమరావతి లో జనసేన పార్టీ భవన నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. పాలనా వ్యవస్థ దారుణంగా తయారయిందన్నారు. వ్యవస్థలను చంద్రబాబు నిర్జీవం చేస్తుంటే, లోకేష్ చంపేస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు చెబుతున్నానని, పంచాయతీ ఎన్నికలు పెట్టాలని, రాజ్యాంగేతరశక్తి గా వ్యవహరించవద్దని చెప్పారు. దయచేసి పంచాయతీ ఎన్నికలు పెట్టాలని, లేదంటే మాజీ సర్పంచ్‌ లతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలపై ప్రేమ ఉంటే ఎన్నికలు పెట్టాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: