పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటికి వచ్చిన తరువాత ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నాడు. టీడీపీ కీ  ఇప్పటివరకు జగన్ మాత్రమే ప్రధాన పోటీగా ఉండేవాడు ఇప్పడూ జగన్ కు పవన్ తోడై సరికే టీడీపీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అయితే పదే పదే పవన్ లోకేష్ ను టార్గెట్ చేయడంతో చంద్ర బాబు కు భయం పట్టుకున్నది. లోకేష్ ను ఫ్యూచర్ లీడర్ గా ప్రమోట్ చేయాలనీ బాబు అనుకుంటుంటే పవన్ మాత్రం లోకేష్ ని ఘోరంగా అవమానిస్తున్నారు. 


పవన్ మీద భగ్గుమంటున్న శ్రీకాకుళం.. కాకమ్మ కబుర్లు చెప్పడం మాను పవన్...!

గోదావరి జిల్లాలో కవాతు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై మాటల తూటాలు విసిరారు. దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని, జనసేన సత్తా చూపిస్తుందని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే, మాజీ సర్పంచ్ లు అందరితో కలిసి ఉద్యమం నిర్వహిస్తా అని ఆయన హెచ్చరించారు. కోర్టు చేత ఈ విషయంలో మొట్టికాయలు తినవద్దని పవన్ అన్నారు.


పవన్ మీద భగ్గుమంటున్న శ్రీకాకుళం.. కాకమ్మ కబుర్లు చెప్పడం మాను పవన్...!

పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల లక్షల కోట్ల రూపాయల కేంద్ర నిధులు వెనక్కు పోతున్నాయని ఆయన అన్నారు. సిఎమ్ చంద్రబాబు, ఆయన కుమారుడు పంచాయతీ మంత్రి లోకేష్ కలిసి, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని పవన్ విమర్శించారు. పంచాయతీ లెవెల్ లో కూడా పోటీచేయలేని లోకేష్ ను ఏకంగా మంత్రిని చేసారని పవన్ దుయ్యబట్టారు. విజన్ 2020 ఫలితం ఇవ్వలేదని, చంద్రన్న పథకాలు అన్నీ ప్రచారం కోసం తప్ప మరేమీకాదని తాను ఎక్కడికి వెళ్లినా జనం చెబుతున్నారని పవన్ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: