కేసిఆర్ నాయకత్వంలోని నిరంకుశ కుటుంబ కుల మత ఆధిపత్య పాలనావ్యవస్థను ధీటుగా ఎదుర్కునేందుకు మహాశక్తివంతమైన ప్రతిపక్షాల ఐఖ్య "మహాకూటమి" ఏర్పాటు చేసినట్లు  అయితే ఇప్పుడు  కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌ ల మహాకూటమికి తెలంగాణ పరిరక్షణ వేదిక అని పేరు పెట్టుకున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమం-సీఎంపీ లో భాగంగా ఈ వేదిక ఏర్పాటు చేయాలని కూటమి నిర్ణయం తీసుకుంది. 
Image result for telangana parirakshana vedika
గత నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా సాగిన నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడినట్లు అధినేత కోదండరాం తెలిపారు. ప్రతి పక్షాలన్ని కలిసి ఏర్పాటు చేసిన ఈ  కూటమి టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం ఖాయమని అన్నారు.  


మంచిర్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో కోదండరాం టీజెఎస్ కార్యకర్తలు, ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తాను కాంగ్రెస్ కు అల్టిమేటం జారీ చేయడానికి గల కారణాలను వివరించారు. కూటమి లోని పార్టీల మధ్య పొత్తుల విషయంలో ఆలస్యం జరిగే కొద్దీ గందరగోళం తలెత్తుతోందన్నారు. దీంతో నిరంకుశ శక్తులకు లాభం జరిగే ప్రమాదమున్నందున త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని తాను డిమాండ్ చేసినట్లు కోదండరాం వివరించారు.
Image result for telangana parirakshana vedika
మిత్ర పక్షాల కూటమికి సీట్లు కేటాయించే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయే అని ఆయన స్పష్టం చేశారు. అయితే తెలంగాణ జన సమితి మాత్రం గెలిచే స్థానాలనే కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు.  

తెలంగాణ ఉద్యమ ఆంకాంక్షను నేరవేర్చకుండా ఈ నాలుగేళ్ల పాలన కొనసాగినట్లు కోదండరాం ఆరోపించారు. అందువల్లే ఆ లక్ష్యం నెరవేరడానికి అన్ని పార్టీలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. 
Image result for telangana parirakshana vedika seats allocation by congress

అయితే ప్రతిపక్ష ఐఖ్య కూటమికి చైర్మన్‌ గా టీజేఎస్‌ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేరును భాగస్వామ్యపక్షాలన్నీ ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలంగాణ పరిరక్షణ వేదిక పేరు తో రాష్ట్రమంతటా ప్రచారం చేయాలని కూటమిలోని పార్టీలు కోదండరాంను కోరుతున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలును పర్యవేక్షించేందుకు వేదిక పనిచేస్తుందని తెలుస్తుంది.
Image result for telangana parirakshana vedika seats allocation by congress

ఈ వేదిక చైర్మన్‌గా ఉండేందుకు కోదండరాం ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. నాలుగైదు రోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన చేసేలా, తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మిగిలిన భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఒకసారి ప్రకటన జరిగితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కార్యక్రమాన్ని కోదండరాంకే అప్పగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.


టీడీపీకి 14, టీజేఎస్‌కు 5, సీపీఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ 20, సీపీఐ 8 స్థానాలకోసం పట్టుపడు తున్నాయి. ఈ నేపథ్యంలో కోదండరాంకు సీట్ల సర్దు బాటు వ్యవహారాన్ని అప్పగించాల నేది ఉత్తమ్‌ కుమార్‌ వ్యూహంగా కనబడుతోంది. 


అయితే కాంగ్రెస్ నాయకత్వంలో ఈ తెలంగాణ పరిరక్షణ వేదిక నడవనున్నందున ఈ సీట్ల పంపకం వ్యవహారం కాంగ్రెస్ కే ఉంటుందని కూటమి అభిప్రాయ పడటంతో మానిఫెస్టొ మరియు మినిమం కామన్ ప్రోగ్రాం అమలు బాధ్యత ప్రొ. కోదండరాం కు ఒప్పగించి - ఈ సీట్ల పంపకం వ్యవహారం అనుభవఙ్జుడైన కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్దికి ఒప్పగించే నిర్ణయం తీసుకున్నారు. 

Image result for kunduru jana reddy


తెలంగాణ పరిరక్షణ వేదిక లోని పార్టీలతో సీట్ల సర్ధుబాటు ఇంకా ఫైనల్ కాలేదు. మహాకూటమిలోని పార్టీలతో సీట్ల సర్ధుబాటు వ్యవహారాన్ని ఫైనల్ చేసే బాధ్యతను  మాజీ మంత్రి  కుందూరు జానారెడ్డికి అప్పగించారు.
Image result for KCR dictetorship Vs telangana parirakshana vedika

మరింత సమాచారం తెలుసుకోండి: