ఎక్క‌డికో.. ఈ ప‌యనం.. ఏ దిక్కున‌కో.. ఈ స‌మ‌రం! అంటూ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఓ చిత్రంలో పాట‌నే ఇప్పుడు మెగా అభిమానులు రాగ‌యుక్తంగా పాడుకుంటున్నారు. చిరు ఇక రాజ‌కీయాల్లో యాక్టివ్ పాత్ర నుంచి త‌ప్పుకొన్న‌ట్టేనా?   చిరు ఇక పూర్తిగా సినిమాల‌కే ప‌రిమిత‌మ‌వుతారా? వ‌ంటి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న స‌భ్యు డిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో త‌న స‌బ్య‌త్వాన్ని పున‌రుద్ధ‌రించుకోక పోవ‌డ‌మే! వాస్త‌వానికి చిరంజీవి వంటిసున్నిత మ‌న స్కు నికి రాజ‌కీయాలు పెద్ద‌గా అచ్చిరాలేదని అంటారు ప‌రిశీల‌కులు. ఆయ‌న ఎప్పుడూ సౌమ్యుడేన‌ని, కానీ, రాజ కీయాల్లో మా త్రం ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉండాల‌ని ఒక‌రు ఒక మాటంటే.. రెండు మాట‌లు అనే రేంజ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని.. కానీ, చిరు మాత్రం వీటికి క‌డు దూర‌మ‌ని చెబుతుంటారు. 

Image result for chiru praja rajyam

అయినా కూడా ఆయ‌న 2007లో ఎన్నో ఆశ‌లు, ఆశ‌యాల‌తో(వాస్త‌వానికి త‌న‌కు లేవ‌ని, ఎవ‌రో ప‌క్క‌నుండే వారు గాలి కొట్టి చిరంజీవిని రాజ‌కీయాల్లోకి తెచ్చార‌ని అంటారు) ఆయ‌న ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి దిగారు. అయితే, అనూహ్యంగా చిరుకు త‌న సొంత జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. ఆయ‌న పోటీ చేసినా ప్ర‌జ‌లు మాత్రంఓడించారు. అయితే, దీనిని ముందుగానే ఊహించాడో ఏమో చిరు తిరుప‌తిలోనూ పోటీ చేశారు. ఇక‌, ఆ ఎన్నిక‌ల్లో క‌నీసం అదికారంలోకి రాక‌పోయినా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో అయినా ఉంటాన‌ని చిరంజీవి భావించారు. కానీ, 2009 ఎన్నిక‌ల్లో చేదు అనుభ‌వం ఎదురైంది. కేవ‌లం 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 

Image result for pawan kalyan

వారు కూడా ఆ త‌ర్వాత చాలా మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ ప‌రిణామంతో చిరంజీవి పార్టీని నిల‌బెట్టుకునే ప‌రిస్థితి క‌ష్ట‌మ‌ని బావించి కాంగ్రెస్‌లోనే త‌న పార్టీని విలీనం చేశారు. అంతేకాదు, చిరంజీవి కేంద్రంలో మంత్రి ప‌ద‌విని సైతం పొందారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వం తీసుకున్నారు. ఇక‌, ఈ నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా మారారు. 150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి... ప్రస్తుతం స్వాతంత్య్ర‌ సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈనేప‌థ్యంలోనే చిరంజీవి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్టు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి. లేదు. ఆయ‌న త‌న త‌మ్ముడు స్థాపించిన జ‌న‌సేన‌లో కీల‌కంగా మార‌తారా? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. 


రాజ‌కీయాల్లో చిరు మెరుపులు/మ‌ర‌క‌లు
+ పార్టీ పెట్టి ప్ర‌భంజ‌నం సృష్టిస్తాడ‌ని అనుకున్నా.. మెగా అభిమానులు మెండుగా ఉన్న జిల్లాల్లోనూ చిరంజీవికి సెగ‌లు త‌ప్ప‌లేదు. 
+ సామాజిక న్యాయం పేరుతో తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌జారాజ్యం పార్టీలో 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్ల వ్య‌వ‌హారం సామాజిక న్యాయాన్ని ప్ర‌శ్నార్త‌కం చేసింద‌నే అప‌వాదునుచిరు భ‌రించాల్సి వ‌చ్చింది. 
+ త‌న సొంత బావ‌మ‌రిది అల్లు అర‌వింద్ భారీ ఎత్తున టికెట్ల‌ను అమ్ముకున్నార‌న్న వ్యాఖ్య‌లను చిరు నేటికీ ఖండించ‌లేక‌పోయారు. 
+ ఇక‌, ఏ గ‌డ్డ‌మీదైతే.. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఓ పార్టీ(టీడీపీ) పుట్టిందో.. అదే గ‌డ్డ‌పై పుట్టిన మ‌రోపార్టీ(ప్ర‌జారాజ్యం) అదే కాంగ్రెస్‌లో విలీనం కావ‌డం చ‌రిత్ర‌గా మిగిలిపోయింది. 
+ కేంద్రంలో మంత్రిగా అయిన త‌ర్వాత చిరంజీవి త‌న కుమారుడికి మేలు చేసి పెట్టార‌నే వ్యాఖ్య‌లు బాగానే వినిపించాయి. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న త‌న కుమారుడికి ట్రూజెట్ పేరుతో విమాన యాన సంస్థ‌కు అంకురార్ప‌ణ  చేశారు. 
+ ఏదేమైనా.. అనుకున్న రేంజ్‌లో చిరు స‌క్సెస్ కాలేద‌నే వ్యాఖ్య‌లు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: