ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడితే అందులో అప్పటి కాంగ్రెస్ నాయకుడు నాదెండ్ల భాస్కర రావు చేరి కో పైలెట్ అవతారం ఎత్తారు. నాటి రాజకీయాల్లో ఆ ఇద్దరి జంట పైలెట్, కో పైలెట్ అంటూ కడు చిత్రంగా అనిపించేది. కనిపించేది. అయితే తరువాత నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్  జరగడంతో కో పైలెట్ అన్న మాట అంటేనే జడుసుకునే పరిస్తితి.ఏర్పడింది.


ఇక్కడ ఆయనేనా :


ఇక ఇపుడు అంటే నలభయ్యేళ్ళ తరువాత అదే సీన్ రిపీట్ కాబోతోంది. మరో  సినీ నటుడు పవన్ కళ్యాణ్  పార్టీలో కో పైలెట్ గా అదే నాదెండ్ల వారసుడు మనోహర్ వ్యవహరించబోతున్నాడుట. పోలికలు బాగా కుదిరాయి. అక్కడా, ఇక్కడా హీరోల పార్టీలో, పక్కన నాదెండ్ల ఫ్యామిలీయే. కానీ నాడు జరిగిన వెన్నుపోటు నేడు జరదని చెప్పొచ్చు. ఎందుచేతనంటే మనోహర్ అలాంటి  వారు కాదు, పైగా. క్లీన్ ఇమేజ్ ఉంది. ఇక పవన్ కూడా నాటి అన్న గారి కంటే ఇప్పటి రాజకీయం బాగా వంటబట్టించుకున్న వాడు. సో ఆ ప్రమాదమేమీ లేదని ఆ పార్టీలో నేతలే  చలోక్తులు విసురుతున్నారు.


పార్టీలో నంబర్ టూ :


జనసేనలో నాదెండ్ల మనోహర్ నంబర్ టూ గా ఉంటారని తెలుస్తోంది. పవన్ ఆయన్ని పార్టీలో చేర్చుకున్నాక మొత్తం విజయవాడలోని తన ఆఫీస్ అంతా స్వయంగా చూపించి అంతా చూసుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో నాదెండ్ల అనుభవాన్ని కూడా వాడుకోవాలని పవన్ అనుకుంటున్నట్లు భోగట్టా. అంటే పవన్ గ్లామర్, మనోహర్ గ్రామర్ కలసి జనసేనను హిట్ చేస్తునందని అంతా నమ్ముతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: