వైసిపినేమిటి తెలుగుదేశంపార్టీ అభినందించటమేమిటని అనుకుంటున్నారా ? నిజమేనండి. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని టిడిపి ఎంపి రామ్ మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఇంతకీ విషయం ఏమిటంటారా ? అదేనండి తిత్లీ తుపాను బాధితులకు సహాయార్ధం జగన్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు కదా ? అందుకనే శ్రీకాకుళం ఎంపి తన ట్విట్టర్ ఖాతాలో జగన్ అభినందింస్తూ ఓ ట్వీట్ పెట్టారు.

 

ఈమధ్య వచ్చిన తిత్లీ తుపాను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను బాగా దెబ్బ తీసిన సంగతి అందరికీ తెలిసిందే. తుపాను దెబ్బ కొట్టేసమయానికి  పాదయాత్రలో భాగంగా జగన్ విజయనగరం జిల్లాలోనే పర్యటిస్తున్నారు.  పాదయాత్రలో ఉన్న జగన్ తుపాను బీభత్సాన్ని కళ్ళారా చూశారు. దాంతో చలించిపోయి వైసిపి తరపున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాకుండా వైసిపి తరపున నేతలు, శ్రేణలను సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా సూచించారు.


జగన్ ఎప్పుడైతే పిలిపిచ్చారో వెంటనే ఎక్కడికక్కడ వైసిపి నేతలు, కార్యకర్తలు సహాయ చర్యల్లోకి దిగారు. నేతలు ఎక్కడికక్కడ బాధితులకు ఆహారం, మందులు, మంచినీరు తదితరాలను అందిస్తున్నారు. దాంతో సహాయక చర్యలు ఒక్కసారిగా ఊపందుకుంది. అదే విషయాన్ని టిడిపి శ్రీకాకుళం ఎంపి రామ్ తన ట్విట్వర్ ఖాతాలో ప్రస్తావించారు. అవసరం వచ్చినపుడు రాజకీయాలు చూడకుండా తక్షణమే సహాయం కోసం రంగంలోకి దిగిన జగన్ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సమయంలోనే కదా మనిషి మనిషికి సాయం చేయాల్సింది.


మరింత సమాచారం తెలుసుకోండి: