ఎన్నికల వేళ  అధికార పార్టీ నేతలు భవిష్యత్తులో తమకి అడ్డు వస్తుందని అనుకునే పార్టీల ఓటర్ల ఓట్లని లెక్కలోనుంచీ తీసేస్తారు..ఇది ప్రతీ రాష్ట్రంలో దేశంలో జరిగే తంతే..అయితే మనం ఓటు వేయాలని అనుకోవడం వేయడం మన హక్కు రాజ్యాంగం ఇచ్చిన ఆ హక్కుని ఏ పార్టీ అయినా ఎటువంటి వ్యక్తులు అయినా సరే కాలరాయాలని అనుకోవడం రాజ్యంఘ ఉల్లంఘన క్రిందకే వస్తుంది అయితే కొన్ని కారణాలు చూపించో మరే ఇతర మార్గాల ద్వారానో ఓట్లని తీసేస్తూ ఉంటారు..

 

ముఖ్యంగా యువకుల ఓట్లని పార్టీలు తప్పించేస్తూ ఉంటాయి..ఏపీలో చూస్తే అధికార టీడీపీ పార్టీ ఇప్పటి వరకూ జనసేనకి సంభందించిన దాదాపు 18 లక్షల పై చీలుకు ఓట్లని తొలగించిందని మొత్తంగా చూస్తె 21 లక్షల ఓట్లని ఓటర్ల హక్కులని కాలరాసిందని అందుకే ప్రతీ ఒక్కరూ ఈ సేవా సెంటర్స్ కి వెళ్లి ఓటు మీ పేరు పై ఉందా లేదా చూసుకుని లేకపోతే మళ్ళీ నమోదు చేసుకోవాలని తెలిపింది..అయితే

 

ఇప్పుడు మీ ఓటు హక్కు ఉందా లేదా అనేది మీరు ఈ సేవా కేంద్రాల వరకూ కూడా వెళ్ళనవసరం లేదు..మీ మొబైల్ నుంచీ ఒక్క మెసేజ్ ద్వారా మీ ఓటు హక్కుని పరీక్షించుకోవచ్చు అది ఎలాగంటే..మీ మొబైల్ లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.. ముందుగా  AP అని టైపు చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ VOTE అని టైపు చేసి ఆ తరువాత మీ ఓటరు కార్డుపై ఉండే ఐడీ నెంబర్ ని టైపు చేయాలి. ఆ తరువాత ఆ మెసేజ్ ని 51969 కి పంపితే  మీకు వెంటనే మీ పేరుపై ఓటరు కార్డు ఉందా లేదా అనేది తెలుప బడుతుంది.

EX :-       AP VOTE వోటర్ ఐడీ నెంబర్ అని టైపు చేసి  51969 కి సెండ్ చేయండి    

 


మరింత సమాచారం తెలుసుకోండి: