చిరంజీవి ఇప్పడూ పూర్తి గా సినిమా ల కోసమే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. పేరుకు కాంగ్రెస్ లో ఉన్నాడు కానీ ఆ పార్టీ లో పెద్దగా చురుకుగా పని చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చిరంజీవి కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తాడని చాలా మంది ఆశించారు.  ఒకవైపు విజయశాంతి ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉండగా.. మరోవైపు ఆమెతో సినీ ప్రపంచంలో హిట్ పెయిర్ గా అప్పట్లో చెలామణీ అయిన మెగాస్టార్ కూడా కలిసి రంగంలోకి దిగారంటే గనుక.. ఇక తమ  పార్టీ హవా మామూలుగా ఉండదని వారు అంచనా వేశారు.

Image result for chiranjeevi and congress

మరోవైపు బాలయ్య కూడా తెదేపా తరఫున ప్రచారానికి సిద్ధమే గనుక.. మహాకూటమికి సినీజోష్ ప్రచారం ఫుల్లుగా ఉంటుందని ఆశించారు. అయితే అంచనాలు బెడిసికొట్టాయి. మెగాస్టార్ చిరంజీవి ఏకంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్నే తుడిచేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా పునరుద్ధరించుకోలేదు. ఇంతటితో రాజకీయ అనుబంధాన్ని తెగతెంపులు చేసుకున్నట్లుగానే భావించాల్సి వస్తోంది. తన మంత్రిపదవి అయిపోయిన నాటినుంచి చిరంజీవి చాలా సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. రాజకీయంగా ఎక్కడా యాక్టివ్ గా పాల్గొనలేదు.

Image result for chiranjeevi and congress

కనీసం ప్రత్యేకహోదా గురించి రాజ్యసభలో గొడవలు జరిగినప్పుడు కూడా స్పందించలేదు. తీరా కొన్నాళ్లకిందట ఆయన ఎంపీ పదవి కూడా ముగిసిపోయింది. అప్పటినుంచి అసలు రాజకీయ ఊసుతో నిమిత్తం లేకుండా బతుకుతున్నారు. ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నారు. సినిమా తప్ప మరో ప్రపంచం లేదన్నట్లుగా ఉంటున్నారు. కాకపోతే.. తెలంగాణ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయనను ప్రచారానికి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. రాష్ట్ర నాయకులు ఆయనను సంప్రదించారు. అంతటితో ఆగకుండా. రాహుల్ తో కూడా మాట్లాడించినట్లు సమాచారం. అయితే మెగాస్టార్ మాత్రం తాను ప్రచారానికి వచ్చేదీ లేనిదీ ఏ సంగతి తేల్చి చెప్పలేదు. వ్యవహారాన్ని నాన్చేశారు. అయితే తాజాగా ఆయన సభ్యత్వం కూడా పునరుద్ధరించుకోకపోవడంతో.. ఇక కాంగ్రెస్ తో సంబంధం లేదని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: