పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో కానిస్టేబుల్ కొడుకునని చాలా సార్లు చెబుతుంటాడు. నిజానికి పవన్ కానిస్టేబుల్ కొడుకు అయితే అయి ఉండొచ్చు కానీ జనాలకు మెగాస్టార్ తమ్ముడిగా, కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోగా ప్రజలకు తెలుసు. అభిమానులంతా సీఎం సీఎం అని అరుస్తుంటే.. మీరు చేసే నినాదమే నిజమవుతుందని అన్నారు పవన్. మా తాత, నాన్న సీఎం అయ్యారు కనక నేనూ సీఎం అవుతానని లోకేష్ అనుకున్నప్పుడు, ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు సీఎం ఎందుకు కాలేడు, కచ్చితంగా అవుతాడని అన్నారు పవన్. 

స్పష్టంగా చెప్పడు, కానీ పవన్ ఆశలన్నీ దానిపైనే

మొదట్నుంచీ తనో సాధారణ కానిస్టేబుల్ కొడుకునంటూ కలరింగ్ ఇస్తూ, బీద అరుపులు అరిచే పవన్, మెగాస్టార్ తమ్ముడిగా, కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా అనుభవించిన రిచ్ లైఫ్ స్టైల్ ని ఏనాడూ బైటపెట్టుకోడు. చాయ్ వాలా ప్రధాని అయ్యాడని మోదీని అనుకున్నట్టే.. తనను కూడా కానిస్టేబుల్ కొడుకు సీఎం అయ్యాడని అంతా అనుకోవాలనేది పవన్ తాపత్రయం. అందుకే అవసరం ఉన్నా లేకున్నా తానో కానిస్టేబుల్ కొడుకుని అని పదేపదే తన ప్రసంగాలతో గుర్తు చేస్తుంటారు పవన్. 


పవన్ మీద భగ్గుమంటున్న శ్రీకాకుళం.. కాకమ్మ కబుర్లు చెప్పడం మాను పవన్...!

నాన్న సెంటిమెంట్ తో పాటు, అమ్మ సెంటిమెంట్ ని కూడా పదే పదే వాడుతున్నారు పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల్లో తాను టీడీపీని సపోర్ట్ చేస్తే, తన మద్దతుతో గెలిచినవాళ్లు చివరకు తన తల్లినే దూషించారని అన్నారు. శ్రీరెడ్డి ఎపిసోడ్ ని మరోసారి పరోక్షంగా ప్రస్తావించారు. ఇక తన ప్రసంగంలో మరోసారి టీడీపీకి గతంలో మద్దతిచ్చిన విషయాన్ని సమర్థించుకున్నారు పవన్. చంద్రబాబు వంటి అనుభవం ఉన్న వ్యక్తికి మద్దతిస్తే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఈసారి అలాంటి తప్పు జరక్కూడదనే బరిలో దిగుతున్నానని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: