ఎన్నికల వేళ నాయకులు ఇచ్చే హామీలు అన్నీ ఇన్నీ కావు. కొండ మీద కోతినైనా తెస్తామంటారు. అలా అన్ని పార్టీలు చెబుతాయి. కానీ జనం కొందరినే నమ్ముతారు. వారు చెప్పింది చేస్తామన్న్న వారిని గుర్తించుకుని మరీ ఓటేసి గెలిపిస్తారు. ఇపుడు తెలంగాణాలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. కేసీయార్ వరాల మూట విప్పేశారు.


రైతే రాజుగా టీయారెస్ మ్యానిఫేస్టో :


రైతును రాజుగా చేయాలని, చూడాలని టీయారెస్ భావిస్తోంది. అందుకోసం  అనేక ఎన్నికల హామీలను వెల్లువలా కురిపిస్తోంది. రైతులకు ఏడాదికి లక్ష రూపాయలు రుణ మాఫీ, రెండేళ్ళలో  కోటి ఎకరాలకు సాగు నీరు, రైతులందరి పంట పొలాలకు నాణ్యమైన విద్యుతు, రైతు సమన్వయ కమిటీలకు గౌరవ‌ భ్రుతి వంటివెన్నో కేసీయార్ హామీల్లో ఉన్నాయి.


పించన్ల వరద :


ఇక మరో వైపు అన్ని వర్గాల ప్రజలకు ఆసరా ద్వారా ఇచ్చే  వ్రుద్ధాప్య పించన్లు 57 ఏళ్ళకే ఇస్తామని కేసీయార్ ప్రకటించడం మరో హైలెట్. దీని వల్ల ఇప్పటివరకూ ఇస్తున్న 39 లక్షల పించన్లకు తోడుగా కొత్తగా  మరో ఎనిమిది లక్షల మందికి అదనగా పించను లభిస్తుంది. అంతే కాదు. ప్రస్తుతం  ఇస్తున్న పించను వేయి రూపాయల నుంచి 2016 రూపాయలకు కూడా కేసీయార్ పెంచారు. అలగే దివ్యాంగుల పించను ఏకంగా 3016 రూపాయలు చేస్తూ వరాలు ఇవ్వడం విశేషం.


నిరుద్యోగులకు హామీ :


ఇక నిరుద్యోగులకు నెలకు భ్రుతి గా  3016 రూపాయల వరకు ఇవ్వడానికి టీయారెస్ ప్రణాళికలో పెర్కొన్నారు. దీనివల్ల ఉపాధి లేకపోయినా తనకు తాను బతికేందుకు భరోసాగా దీనిని ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అదే విధంగా చిరుద్యోగులైన, అన్ని ప్రభుత్వ  కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జీతాలు తప్పకుండా పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే దేశంలో అంగన్వాడీలకు, హోం గార్డులకు ఎవరూ ఇవ్వని వేతనాన్ని ఇస్తున్నామని, దానిని మరింతంగా పెంచుతామని కేసీయార్ వాగ్దానం చేశారు.


అగ్ర వర్ణాలకు కార్పోరేషన్లు :


ఇక అగ్ర వర్ణాల పేదలనూ టీయారెస్ ఎన్నికల ప్రణాళిక ఆకట్టుకునేల రూపకల్పన చేశారు. వైశ్యులకు, రెడ్లకు కూడా ప్రత్యేకంగా కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకు రెండు లక్షలు వంతున పేదలందరికీ డబులు బెడ్ రూం ఇళ్ళు కట్టించి ఇస్తామని కూడా ఎన్నికల హామీ ఇచ్చారు. మొత్తం మీద చూసుకుంటే ఏ ఒక్క వర్గాన్ని పక్కన పెట్టకుండా టీయారెస్ రూపొందించిన ఈ ఎన్నికల ప్రణాళిక చాలా గొప్పగా ఉందందే చెప్పాలి. మరి జనాలు స్పందన ఎలా ఉంటుందందేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: