ఈ మద్య ఒక రాజకీయ పార్టీ స్థాపించి, బలమైన పునాదులపై నిలపాలంటే ఆదర్శాలు, సిద్ధాంతాలు, సేవానిరతి కాకుండా - కుటుంబం, బందు బలం, కులజన సమైఖ్య బలం, అంగబలంతో పాటు మద్దతు నిచ్చే చెదరిని కుల మీడియా అనేవి ప్రదానాంశాలు గా మారిపోయాయి. ఇవి లేని పార్టీ ఇల లో మన లేదు అనేది ఋజువవటానికి తెలుగుదేశంపార్టీ ప్రధాన ఉదాహరణ. అలాగే తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ.  జగన్ పార్టీగానే వైసిపి మిగిలిపోతుంది. కాకపోతే ఇందులో ఒక సామాజికవర్గం ప్రాధమ్యం ఉన్నా అందరూ కలసి ఉన్నట్లే ఉంది. ఎందరున్నా జగన్ చుట్టూతే ఈ పార్టీ చట్రం తిరుగుతుంది. ప్రస్తుతానికి అదే తరహా లో రూపుదిద్దుకుంటున్న జనసేన పార్టీ, ఇంకా పిండదశ లోనే ఉంది. అయితే చిరంజీవి జనసేన ప్రవేశం ఈ పిండానికి ప్రాణంగా మారనుంది. 

Image result for chiranjeevi joins in to janasena good by to congress

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి తనేమిటో తన సత్తా చూప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి తన పార్టీ జనసేన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రత్యక్షంగా బరి లోకి దిగుతున్నారు. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రయత్నానికి అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ అగ్రజుడు మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. 

Image result for chiranjeevi joins in to janasena good by to congress

చిరంజీవి జనసేనలోకి రావడం కాస్త అటూ ఇటూగా పక్కా అయినట్లేనని జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తన సత్తా గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 80 లక్షల ఓట్లను సాధించారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం, తద్వారా రాజ్యసభకు వెళ్లడం, కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా పనిచెయ్యడం అన్నీ విజయ వంతంగా వరుస వరుసగా జరిగిపోయాయి.

Image result for chiranjeevi joins in to janasena good by to congress

అయితే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పతనం తరవాత చిరంజీవి రాజకీయాల్లో అంతగా కనిపించలేదు. ‘ప్రత్యేక హోదా అంశం’ పై కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినప్పుడు మాత్రం మెరుపులా మెరిసి మాయమయ్యారు. సినీ ప్రస్థానంలో ఆయన నటించిన 150వ చిత్రం ఖైదీనంబర్ 150 సినిమాలో బిజీబిజీగా ఉన్నట్లునాడు  ప్రకటించారు. ప్రస్తుతం చిరంజీవి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమా సైరా గా మలిచే పనిలో తనమునకలై ఉన్నారు. ఎన్నికలనాటికి ఇదో మహాప్రభంజనమై రెడ్డి వర్గాన్నికూడా ఇందులో కలుపుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Image result for chiranjeevi joins in to janasena good by to congress

అయితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సభ్యత్వ కాలపరిమితి ముగిసినా దాన్ని పునరుద్ధరించుకోలేనంతగా పనివత్తిడిలో ఉన్నారా? లేక కాంగ్రెస్ పార్టీ అంటే అయిష్టతతో ఉన్నారా? ఇంకా  తన సోదరుడు పవర్ స్తార్ పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేనకు ఊతం అందించాలని ప్రయత్నిస్తున్నారా? అన్న సందేహాలకు కాలమే సమాధానం చెపుతుంది.  అందుకే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కి వీడుకోలు పలికేందుకే ఆ పార్టీ సభ్యత్వం పునరుద్ధరించుకోలేదని ప్రచారం విరివిగా జరుగుతోంది. ఇదంతా సైరా గారి  రాజకీయ సయ్యాట అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Image result for chiranjeevi joins in to janasena good by to congress

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించి నప్పుడు కూడా చిరంజీవి ఆయన సభకు హాజరుకాలేదు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీని కలుస్తారని అందరూ భావించినా చిరంజీవి దాన్ని లక్ష్యమే పెట్టలేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గూనకుడా పార్టీ ఆదేశాలను సున్నితంగా తిరస్కరించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్రియాశీలకంగా పని చెయ్యాలని రాహుల్ గాంధీ చిరంజీవిని ప్రత్యేకించి కోరినా చిరంజీవి స్పందించలేదు. 

Image result for chiranjeevi joins in to janasena good by to congress

మరోవైపు తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తాపత్రయ పడుతోంది.  అయితే సినీ నటుడుగా ఉన్న చిరంజీవి ఇమేజ్, క్రేజ్, గౌరవంతో అసంఖ్యాక అభిమానులు ఉన్న చిరంజీవిని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఒక వైపు విజయశాంతి, మరోవైపు చిరంజీవి ఇరువురి అభిమానులపై వలవేసి తో కాంగ్రెస్ ఓట్లు చేపలు పట్టాలని ప్రయత్నం చేసినా ఛిరంజీవి మౌనమే సమాధానమైంది. 

Image result for chiranjeevi vijayashanti images

చిరంజీవి కాంగ్రెస్ పార్టీ లో కొనసాగాలనుకుంటే ఇలా చేసేవారు కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కావాలనే చిరంజీవి పార్టీ సభ్యత్వం కాలపరిమితి ముగిసినా దాన్ని పునరుద్ధరించుకోలేదని వార్తలు గుప్పుమంటున్నాయి. అటు చిరంజీవి ఫ్యాన్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ఇటు చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో కీలకంగా వ్యవహరించే యర్రా నాగబాబు సైతం జనసేనలో మమేకమైపోయారు. ఇలా చిరంజీవి చుట్టూ ఉన్న కేడర్ అంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో మాయమై జనసేన లో దర్శనమిస్తున్నారు.  ఇప్పటికే చిరంజీవి అభిమానగణమంతా  జనసేన సైనికులుగా రూపాంతరం చెందింది.

Image result for chiranjeevi joins in to janasena good by to congress

ఇదంతా వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ అని అంటున్నారు. ఇప్పటికే పలువేదికలపై అన్న చిరంజీవిపై తన అభిమానాన్ని ప్రేమను బయటపెడు తున్నాడు పవన్ కళ్యాన్.  నాడు సొంత అన్నయ్యను కాదని టీడీపీకి మద్దతు ఇచ్చానని దానికి ప్రాయస్చిత్తం చేసుకోవటమే శరణ్యమని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ చిరంజీవి అభిమాను లదేనంటూ అన్నయ్య అభిమానులను అన్నయ్యను కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు అన్నయ్యను కాదని టీడీపీకి మద్దతు ఇచ్చి అధికారంలోకి తీసుకు వచ్చానని చింతున్నారు.  అలా కాకపోతే ఏమయ్యి ఉండే దంటూ అభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అన్నయ్య చిరంజీవి, తాను కలిస్తే ఎలా ఉంటుందో ఊహించాలంటూ పరోక్షంగా తమ బలాన్ని వారి ఊహల్లో ఆశక్తి బాహుబలి అంత సినిమాగా చూపుతున్నారు. 

Image result for chiranjeevi joins in to janasena good by to congress

తాను ఒక పార్టీకి అదే తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తేనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అలాంటిది అన్నయ్య సాయంతో తాను బరిలోకి నిలిస్తే ఒక అచంచల నిర్ణయా త్మకశక్తిగా మారలేమా? అంటూ పవన్ అభిమానులతో చర్చించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పలు వేదికలపై అన్న చిరంజీవిపై తన ప్రేమను అభిమానాన్ని చూపి స్తుండటంతో చిరంజీవిలో మార్పు వచ్చిందని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి జనసేనకు జై కొట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

Image result for chiranjeevi joins in to janasena good by to congress

నాడు తాను ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్యగా  తనకు యువ శక్తిగా వెన్నుదన్నుగా నిలిచారు. నాడు చిరంజీవి కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంతో నాటి ఋణం తీర్చుకొనే అవకాశం చిరజీవి తనకొచ్చినట్లుగా భావించి తమ్మునితో కలిసి రాజకీయగమ్యం వైపుకు నడిచేందుకు చిరంజీవి నిర్ణయించుకున్నారని సమాచారం. అటు పవన్ కళ్యాణ్ సైతం అన్నయ్య చిరంజీవి పార్టీలోకి వస్తే ఆయనకు గౌరవ ప్రదమైన బాధ్యత కట్టబెట్టాలని జనసేన గౌరవాధ్యక్షుడి హోదాలో కూర్చోబెట్ట నున్నారని సమాచారం.  చిరంజీవి అనుభవాలను, వ్యూహాలను పవన్ కళ్యాన్ వినియోగించుకోనున్నారని తెలుస్తోంది.

Image result for chiranjeevi fans and brothers into janasena

ఇప్పటికే చిరంజీవి అభిమానులు ఒక్కఒక్కరూ జనసేనలో కలిసిపోయి పవన్ కు జై కొడుతున్న తరుణంలో మిగిలిన వారు కూడా చిరంజీవి రాకపోతే జనసేనకు జై కొట్టటం తధ్యం అని ప్రచారం ఊపందుకుంది. నిజానికి జనసేన పార్టీ దినదినప్రవర్ధమానం అవుతుందనేందుకు ప్రత్యక్ష నిదర్శనం రాజమండ్రి “జనసేన కవాతు” దిగ్విజయం కావటమే.  అంతేకాదు పార్టీలోకి అనేక ఇతర పార్టీల్లోని కీలక నేతలు ఒక్కొక్కరు వచ్చి చేరటంతో మరింతగా ఋజువు చేస్తుంది. 

Image result for chiranjeevi joins in to janasena good by to congress

పవన్, చిరంజీవి అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం సైతం జనసేనకు జై కొడుటూ ఆ జెండా క్రింద కాపు ఐఖ్యత అనే అజెండాతో కలిసి పోతున్నారని అభిఙ్జవర్గాల కథనం. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా తమ్ముడి పార్టీ జనసేనకే అండగా నిలవాలని భావిస్తున్నట్లు, జనసేన లో చేరిపోవటం ఖాయమని అన్నయ్య తమ్ముడు కలిసి ఒక నూతన రాజకీయ శఖానికి శంఖం పూరిస్తారు అంటూ, ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.

Image result for chiranjeevi joins in to janasena good by to congress

ఇకపోతే చిరంజీవిని అటు టీడీపీ కూడా ఆహ్వానిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవితో కలిసి పనిచేసిన గంటా శ్రీనివాసరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, కామినేని శ్రీనివాసులు చిరంజీవిని టీడీపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు సైతం చిరంజీవిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణ తెరవెనుక పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: