జగన్ ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నాడు అయితే తిత్లీ తుపాను ఉత్తరాంధ్రను దెబ్బతీసింది. ప్రతి పక్ష నాయకుడైన జగన్ తుఫాను భాదితులను పరామర్శించకపోవడం టీడీపీ వారికి ప్లస్ అయిపోయింది.  మొత్తం 2500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టుగా ప్రభుత్వం అంచనాలు చెబుతున్నది. సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు. మరోవైపున అక్కడి తుపాను బాధిత ప్రజలకు భరోసా అందించడానికి నాయకులు ఎవరెవరు ఎలా స్పందించారనేది కూడా చాలా కీలకమైన విషయం.

జగన్! ఆ ఛాన్స్ బాబుకు ఇవ్వకుండా ఉండాల్సింది

పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన పోరాటయాత్రలో ఉన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్పయాత్రలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ ఇద్దరికీ తుపాను బాధిత ప్రాంతాల పర్యటనకు సమయం లేకపోవడమే చిత్రం. ఇలాంటి వీరి అలసత్వాన్ని చంద్రబాబునాయుడు చాలా చక్కగా వాడుకోగలిగారు. అంతోఇంతో కాస్త ఆలస్యంగా స్పందించినా పవన్ ఉత్తరాంధ్ర పర్యటనను తన ‘కవాతు’ తర్వాత షెడ్యూలు చేసుకున్నారు. కానీ.. జగన్ మాత్రం ఆ ప్రయత్నం చేయనేలేదు. తమ పార్టీ వారు అక్కడి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మాత్రమే ఆ పార్టీ చెబుతోంది.

Image result for jagan

అయితే జగన్మోహన్ రెడ్డి స్వయంగా తుపాను బాధిత ప్రాంతాల పర్యటనకు వెళ్లకపోవడం అనే అంశాన్ని చంద్రబాబునాయుడు చాలా చక్కగా వాడుకుంటున్నారు. ప్రతి శుక్రవారమూ కోర్టుకు హాజరు కావడానికి పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాదుకు వెళ్లే జగన్ కు, ఉత్తరాంధ్ర ప్రజలకోసం ఓ రోజు విరామం ఇవ్వాలని అనిపించడం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిజానికి ఆయన వెటకారపు ధోరణిలో అన్నప్పటికీ.. ఆ పాయింట్ మాత్రం వాస్తవం. రాష్ట్రంలో ఇంత పెను విపత్తు సంభవించినప్పుడు జగన్ ఖచ్చితంగా అక్కడి ప్రజల వద్దకు వెళ్లి.. తన మద్దతు తెలియజేసి ఉండాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: