జనసేనని తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోలు హత్య చేయడంపై పవన్ అన్న మాటలు టీడీపీ రాజకీయంగా వాడుకుంటోంది. ఇందుకోసం కిడారి కుటుంబాన్నే ముందుంచుతోంది. దాంతో వారు పవన్ పై మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.


అవహేళన చెయొద్దు :


నా భర్త మరణించి నెల రోజులు కూడా కాలేదు, పుట్టెడు బాధలో ఉన్నాం, మా మీద విమర్శలు చేస్తారా అంటూ పవన్ పై ఓ రేంజిలో దివంగత కిడారి సర్వేశ్వరరావు సతీమణి పరమేశ్వరి ఫైర్ అయ్యారు. ఎంత కోపం ఉంటే ఓ మహిళా మావోయిస్ట్ ఎమ్మెల్యేను కాల్చి చంపుతుందంటూ కవాతులో పవన్ చేసిన వ్యాఖ్యలు  ఇపుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కిడారి పట్ల కోపం, ద్వేషం ఎవరికీ లేదని, సమాచార లోపం వల్లనే తన భర్తను మావోలు చంపారని పరమేశ్వరి అంటున్నారు తన భర్త మరణాన్ని అవహేళన చేస్తారా అని గుస్సా అవుతున్నారు.


 
రాజకీయం కోసమా :


తమ కుటుంబం అంటే గిరిజనులకు ఎంతో అభిమనం ఉందని, తన భర్త బలమైన నాయకుడు, ప్రజానాయకుడని, అటువంటి తమపై కామెంట్స్ చేయడం ద్వారా పవన్ రాజకీయం చేస్తున్నారని పరమేశ్వరి మండిపడ్డారు. రాజకీయాలకు ఇది విధానమా అంటూ నిలదీశారు. గిరిజనుల మేలు కోరుతూ పనిచేసే తన భర్తకు ఎవరు శత్రువులు లేనే లేరని కూడా చెప్పుకొచ్చారు.  కిడారి చనిపోతే వేలాదిగా జనం వచ్చిన సంగతిని ఆమె గుర్తు చేశారు.


వెనక టీడీపీ :


పరమేశ్వరి కుటుంబం వెనక టీడీపీ నాయకులు ఉండడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మారింది. టీడీపీ మహిళా నాయకురాలు శోభా హైమావతి పక్కనే ఉండడంతో పవన్ ని గిరిజనం  నుంచి దూరం చేయడానికే ఈ కామెంట్స్ చేస్తున్నారని జనసైనికులు అంటున్నారు. పవన్ అన్నది పాలకుల తీరుని తప్పుపడుతూ మాత్రమేనని, వ్యక్తిగతంగా కాదని వారు చెబుతున్నారు అయితే వ్యవహారం ఇందాక వచ్చాక పవన్ ఏమైనా వివరణ ఇస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: