తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ  చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. తిరుపతి ఎంఎల్ఏ సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు పరిపాలనలో ఏపి అవినీతి రాష్ట్రమైపోయిందని బాంబు పేల్చారు. ఎంఎల్ఏ  చేసిన కామెంట్లతో మీడియా ప్రతినిధులతో పాటు టిడిపి నేతలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుగుణమ్మ ఏమన్నారంటే, అవినీతిలో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్ధానంలో నిలిచిందని చెప్పారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో ఇదే విషయం స్పష్టమైందని కూడా ఎంఎల్ఏ చెప్పారు.

 

ఎంఎల్ఏ చేసిన తాజా వ్యాఖ్యలు జిల్లాలో పెద్ద కలకలం రేపాయి. అసలు ఎంఎల్ఏ ఆ విషయాలను ఎందుకు ప్రస్తావించాల్సొచ్చిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. చంద్రబాబు, లోకేష్ కూడా ఇదే విధంగా చాలాసార్లే టంగ్ స్లప్పయిన విషయం మనకు తెలిసిందే. ఒక విషయం చెప్పబోయి ఇంకోటి చెప్పారా అన్న విషయాన్ని కూడా పార్టీ పెద్దలు ఆరాతీస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకోవటం, పారదర్శక పాలన, సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి తగ్గుతోందని చెప్పాలన్నది ఎంఎల్ఏ ఉద్దేశ్యమా అన్నది అర్ధం కావటం లేదు.

 

ఆమధ్య అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ, అభివృద్ధిలో కానీ అవినీతిలో కానీ ఏపిని నెంబర్ వన్ స్ధానంలో నిలపాలన్నదే తన ధ్యేయమంటూ బల్ల చరిచి చెప్పిన విషయం అందరూ చూసే ఉంటారు. ఒకసారి కాదు వివిధ సందర్భాల్లో చాలాసార్లే చెప్పారు. ఇక, పుత్రరత్నం లోకేష్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అవినీతి, కులగజ్జి, పక్షపాతం లాంటిది ఏదైనా ఉందంటే దేశం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్న వ్యాఖ్యలు ఇప్పటికీ హైలైట్ గానే నిలుస్తాయ. సో, అదే పద్దతిలో ఎంఎల్ఏ కూడా అన్నారా అని ఆరాతీస్తున్నారు నేతలు. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో సుగుణమ్మకు టిక్కెట్టు వచ్చే అవకాశాలు కూడా తక్కువే అని ప్రచారం జరుగుతోంది. అందుకనే ఆమె పవన్ కల్యాణ్ తో కూడా టచ్ లో ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: