ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు విశ్లేష‌కులు. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టిన వారే నిజ‌మైన నాయ‌కుడు అవుతార‌నడంలో ఎలాంటి సందేహ‌మూ ఉండ‌దు. త‌నకు ప్ర‌జ‌లు కావాలి. నిత్యం వారిలోనే.,. వారితోనే ఉండాలి..అనుకు నే నాయకుడు విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ను ప్రారంభించి ప్ర‌జ ల్లోనే దాదాపు ఏడాది కాలంగా(వ‌చ్చే నెల 5తో ఏడాది పూర్తి)  పాద‌యాత్ర చేస్తున్నారు. నిజానికి ఇంత పెద్ద వ్యూహాత్మ‌క పా దయాత్ర‌ను గ‌తంలో ఎవ‌రూ చేసి ఉండ‌రు కూడా. ఎన్నో ఆటంకాలు వ‌చ్చినా.. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొనసాగిస్తున్నా రు. అయితే, జ‌గ‌న్‌లో ఒకింత విజ‌న్ లోపించింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పాద‌యాత్ర చేస్తున్న క్ర‌మంలోనే రాష్ట్రంలో ప‌లు చోట్ల విప‌త్తులు సంభ‌వించాయి. 


కానీ, వాటి విష‌యంలో జ‌గ‌న్ స్పంద‌న ఆశించిన విధంగా లేక‌పోగా.. అధికార ప‌క్షానికి, త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు కూడా అవ‌కాశం ఇచ్చేదిగా మారిపోతోంది. తాజా విష‌య‌మే తీసుకుంటే.. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర ఉవ్వెత్తున సాగుతోంది. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు హార‌తులిచ్చి స్వాగ‌తాలు చెబుతూ.. ముందుకు సాగుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ కూడా వారి స‌మ‌స్య‌ల‌ను చాలా ఓపిక‌గా వింటూ ప‌రిష్కారాల‌ను సైతం సూచిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది అయితే, ఇటీవ‌ల ప‌క్క‌నే ఉన్న శ్రీకాకుళంలో తుఫాన్ దెబ్బ‌కు వేలాది మంది ప్ర‌జలు వీధుల పాల‌య్యారు. క‌నీసం తాగేందుకు కూడా నీరు అంద‌ని ప‌రిస్తితి నెల‌కొంది. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ సొంత మీడియా సాక్షి సాక్ష్యాధారాల‌తోనే వెల్ల‌డిస్తోంది. 


మ‌రి ప‌క్క‌నే ఉన్న జ‌గ‌న్ తుపాన్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించారా? అంటే లేద‌నే చెప్పాలి. ఇదే. అధికార ప‌క్షానికి అ డ్వాంటేజ్‌గా మారిపోయింది. దీంతో చంద్ర‌బాబు విమ‌ర్శ‌లబాణాలు సంధించారు. ‘ఆయనకు బుద్ధి ఉందా’ అంటూ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పక్క జిల్లా విజయనగరంలోనే తిరుగుతున్నా, ఒక్క బాధితుడినైనా పరా మర్శించారా అని ప్రశ్నించారు. పైగా, ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలను సైతం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 

నిజానికి ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం క‌న్నాముందుగానే స్పందించాల్సింది విప‌క్షం. కానీ, ఆ త‌ర‌హా వ్యూహం ఎందుకు లోపిస్తోందో వైసీపీ ఇప్ప‌టికీ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవ‌డం లేదు. గోదావ‌రిలో ప‌డ‌వ బోల్తాప‌డిన స‌మ‌యంలోను, కృష్ణాన‌దిలో ప‌డ‌వ బోల్తా ప‌డిన‌ప్పుడు కూడా జ‌గ‌న్ స్పంద‌న నామ‌మాత్రంగానే ఉంది. కానీ, ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు వైసీపీ ఒక విప‌క్షంగా వాటిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. కానీ ఆ వ్యూహ‌మే లోపించి త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: