తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ బోండా ఉమామవేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఓ భూమి కబ్జా కేసులో వివాదాలు ఎదుర్కొంటున్న బోండా వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుల కొటాలో తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని బోండా కబ్జా చేసి అమ్మేసుకున్నారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో విజయవాడలో ఈ కేసు సంచలనమైంది.

 

అధికారాన్ని అడ్డంపెట్టుకుని బోండా లాంటి అధికారపార్టీ నేతలు మామూలు జనాలను ఏ విధంగా దోచేస్తున్నరో చెప్పేందుకు ఆ ఘటన ఓ ఉదాహరణగా నిలస్తుంది. కోటేశ్వరరావుకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని బోండా కబ్జా చేశారు. సదరు భూమిని తన భార్య పేరిట రిజిస్టర్ కూడా చేయించేసుకున్నారు. వేరే ఏదో అవసరం పేరుతో డాక్యుమెంట్లు తీసుకున్న ఎంఎల్ఏ తన అనుచరుల ద్వారా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించి ఆ భూమిని అమ్మేసుకున్నారు కూడా.

 

ఆ విషయం బయటపడంగానే బాధితుడు ఎంఎల్ఏని అడిగితే అనుచరులు కొట్టారు. దాంతో బాధితుడు సిటీ పోలీసు కమీషనర్ ను ఆశ్రయించారు. కమిషనర్ మొత్తం ఘటనపై సిఐడి విచారణ  చేయించారు. దాంతో మొత్తం బండారమతా బయటపడింది. బాధితుని భూమిని ఎంఎల్ఏ కబ్జా చేసిన విషయాన్ని సిఐడి కూడా నిర్ధారించింది. దాంతో కేసు కోర్టుక్కెకింది. అనేక విచారణల తర్వాత కోర్టు ఈరోజు తీర్పిస్తు ఎంఎల్ఏ బోండా తో పాటు ఆయన భార్య మరో తొమ్మిది మందిపై డాక్యుమెంట్ల పోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల తయారీ, బెదిరింపు తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించటం పార్టీలో కలకలం రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: