అవుననే అంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా మాటాలు వింటుంటే అందరిలోను అవే అనుమానాలు వస్తున్నాయి. తెలుగుదేశంపార్టీలో కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందుతులు, దుర్గగుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగలించే దొంగలే ఉన్నారంటూ కన్నా మండిపడ్డారు. టిడిపి నేతలు ఉపయోగించే భాష చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ధ్వజమెత్తారు. బహుశా ఓ టివి చానల్లో టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మధ్య జరిగిన చర్చ విషయంపైనే కన్నా స్పందించుంటారు.

 

ఓ టివి చర్చలో పాల్గొన్న జివిఎల్ ను సిఎం రమేష్ చాలా అసభ్యకరంగా మాట్లాడారు. జివిఎల్ ను ఉద్దేశించి రమేష్ ‘ నీయమ్మ అని కొడకా అని ఊర్లో తిరగ్గలవా ‘ అంటూ ఇషం వచ్చినట్లు మాట్లాడారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణా సిఎం కెసియార్ చంద్రబాబును తిట్టగానే మాట్లాడుతున్న వారంతా ప్రధానమంత్రి నరేంద్రమోడిని చంద్రబాబు తిట్టినపుడు ఎందుకు మాట్లాడలేదంటూ నిలదీశారు.  ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కన్నా సిఎం రమేష్ కు పెద్ద వార్నింగే ఇచ్చారు.

 

రాష్ట్రాన్ని దోచుకుతింటున్న టిడిపి నేతలకు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రాన్ని తిట్టటం ద్వారా తన బాధ్యతల నుండి చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నట్లుందని కన్నా ఎద్దేవా చేశారు. చివరకు తిత్లీ తుపానును కూడా చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారంటూ కన్నా మండిపడ్డారు. పనిలో పనిగా చంద్రబాబుకు కన్నా ఐదు ప్రశ్నలు సంధించారు.

 

పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై సిబిఐతో విచారణకు జరిపించుకోగలరా ? అని అడిగారు. ఎస్టిమేషన్లు పెంచి రమేష్ కు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా ? అన్నది రెండో ప్రశ్న. మూడో ప్రశ్నగా మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డిలను వాటాలు పంచుకోవాలని చెప్పలేదా అని నిలదీశారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే ప్రైవేటు సంస్ధలకు రూ 480 కోట్లు కేటాయించలేదా అనేది నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్నగా ఐటి దాడులు జరిగితే రాష్ట్ర ప్రజల్లో భావోధ్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ నిలదీశారు. మరి, ఐదు ప్రశ్నలకు చంద్రబాబు సమాధనం చెబుతారా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: