సబ్బం హరి టీడీపీ అనధికార ప్రతినిధిగా మారిపోయారు. చాలకాలంగా అయాన పసుపు పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు.  ఈ మధ్య దూకుడు మరీ  పెంచేశారు. అచ్చం టీడీపీ కండువా కప్పుకున్న నేత మాదిరిగా బాగా వెనకేసుకువస్తున్నారు. బాబు ఏపీకి న్యాయం చేస్తూంటే బీజేపీ అన్యాయం చేస్తోందంటూ సబ్బం ఫైర్ అవుతున్నారు.


అంటకాగిన వూసెత్తరు :


నాలుగున్నరేళ్ళ క్రితం బీజేపీతో టీడీపీ అంటకాగి అధికారం అనుభవించిన సంగతిని సబ్బం హరి తెలివిగా కావాలనే పక్కన పెడతారు. అదే సమయంలో ఏపీకి  బీజేపీ ఏమీ చేయలేదని మాత్రం నిందిస్తారు. ఇది పూర్తిగా టీడీపీ వాదనే తప్ప మరోకటి కాదు. సబ్బం హరి వివిధ చానళ్ళలో విశ్లేషకుని హోదాలో సీనియర్ పొలిటీషియన్ గా మాట్లాడుతున్నారు. కానీ ఆయన పూర్తిగా ఒక పక్షానే  నిలబడడం పట్ల విమర్శలు వస్తున్నాయి.


చేరిపోవచ్చుగా :


సబ్బం హరి పరిస్థితి ఎలా ఉందంటే అయన టీడీపీలోకి వెళ్దామనే అనుకుంటున్నారు. కానీ భేషరతుగా అక్కడ చేరిపోవాలి. పదవులు, టికెట్లు ముందే అడగరాదన్న షరతులు వున్నాయని ప్రచారం సాగుతోంది. అదే టైంలో ఆయన రాకను విశాఖ జిల్లాకు చెందిన నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారని టాక్. సబ్బం హరి మాటకారి. చతురత కలిగిన నేత. ఆయన కనుక పార్టీలోకి వస్తే తాము ఎక్కడ లూప్ లైన్లోకి పోతామోనని కొందరు ఆయన్ని  అడ్డుకుంటున్నట్లుగా చెబుతున్నారు. దాంతో సబ్బం చేరిక వాయిదా పడుతూ వస్తోంది.


మెప్పు కోసం :


ఈ టైంలో అధినేత బాబు మెప్పు కోసం సబ్బం హరి ఇలా టీవీలల్లో తన వాణిని వినిపిస్తిన్నారని, ప్రో టీడీపీ వాయిస్ ఇస్తున్నారని అంటున్నారు. సబ్బం హరికి వైసీపీ అంటే గిట్టదు, పవన్ పార్టీ స్థిరత్వం పై నమ్మకం తక్కువ, ఏపీలో కాంగ్రెస్ లేదు, దాంతో ఆయన టీడీపీనే నమ్ముకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మొత్తానికి సబ్బం హరి అనధికార ప్రతినిధిగా మారడం ఆ పార్టీకి అనందకరంగానే ఉందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: