తెలుగు రాష్ట్రాల్లో ఇప్పడూ నిరుద్యోగ భృతి అనేది ఇప్పడూ అన్నీ రాజకీయ పార్టీలకు ఓట్లను కురిపించే హామీగా కనిపిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ 3000 ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. రాజకీయ పార్టీల తీరు నిరుద్యోగ భృతి విషయంలో అత్యంత హాస్యాస్పదం. 'ఉద్యోగమంటే కష్టపడాలి.. ఉద్యోగం లేకుండా ఖాళీగా కూర్చుంటే, ప్రభుత్వాలే నిరుద్యోగ భృతి పేరుతో పోషిస్తాయిలే..' అనే స్థాయికి నిరుద్యోగ యువతని సోమరిపోతులా తయారు చేసేస్తున్నాయి మరి.

Image result for cm kcr

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే చంద్రబాబు సర్కార్‌ నిరుద్యోగ భృతి ప్రకటించింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ అది. 2019 ఎన్నికల ముందర చంద్రబాబు సర్కార్‌ చేస్తోన్న పబ్లిసిటీ స్టంట్‌.. నిరుద్యోగ భృతిని అమలు చేయడం. పొరుగు రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కాబట్టి.. అంటూ, మూడువేల పదహార్లు చదివించేసుకుంటామని తెలంగాణ రాష్ట్ర్ర సమితి అధినేత కేసీఆర్‌, పాక్షిక మేనిఫెస్టోలో ప్రకటించారు. 'సరిపోలేదా.? కావాలంటే పెంచేస్తాం..' అని ఆయన నిరుద్యోగుల నుంచి వచ్చే డిమాండ్‌ మేరకు, దాన్ని ఐదువేల పదహార్లకు పెంచేస్తారేమో. ఇదే అంశాన్ని కాంగ్రెస్‌, తన మేనిఫెస్టోలో ప్రకటిస్తే.. 'తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయాలంటే, దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్‌ అంతా సరిపోదు..' అని కేటీఆర్‌ వెటకారం చేశారు.

Image result for chandrababu and jagan

కేటీఆర్‌కి కౌంటర్‌ ఇచ్చినట్లా.? అన్నట్టుంది కేసీఆర్‌, తాజా ప్రకటన. రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఎంత ఖర్చుచేసినా ప్రశ్నించలేం. ఎందుకంటే, రైతుని ఆదుకోవాల్సిందే. రైతుబంధు పథకం పేరుతో 10 వేలు కాదు, 25 వేలు ఇచ్చినా తక్కువే. కానీ, ఆ డబ్బులు ఎవరి చేతికి వెళుతున్నాయి.? పంట పండించే రైతుకి కాదు, పొలాలు వున్న భూస్వాములకి. మరి, కౌలు రైతులకు దిక్కేది.? తెలంగాణ రాష్ట్ర సమితి వద్ద ఆన్సర్‌ లేదాయె.

మరింత సమాచారం తెలుసుకోండి: