శబరిమల ప్రశాంతంగా ఉండే ఆధ్యాత్మిక పుణ్య ధామం. స్వామి కరుణ కోసం నలభై రోజుల పాటు కఠోర దీక్ష‌లు చేసి భక్తులు అయ్యప్ప  కోసం అక్కడికి వెళ్తారు. అటువంటి ప్రశాంత  శబరిమల ఇపుడు ఉద్రిక్తత‌లకు కేంద్రమవుతోంది. అయ్యప్ప భక్తుల విషయంలో వివక్ష కూడదంటూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సెగలు పొగలు రేపుతోంది. తీర్పుని నిరసిస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు అక్కడకు వచ్చే మహిళా భక్తులను అడ్డుకుంటున్నారు.


తలుపులు తెరచినా :


శబరిమలలో ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు తలుపులు తెరచుకున్నాయి. కానీ మహిళా భక్తుల ప్ర‌వేశం మాత్రం జరగలేదు. ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్తితులు ఎదురవుతున్నాయి. మహిళలు సైతం కొంత దూరం వచ్చినా ఆందోళనకారులకు జడిసి వెళ్ళకుండా వెనక్కు వెల్లీపోయారు. దానికి తోడు వూళ్ళలో సైతం అయ్యప్ప మహిమపై జనాల్లో సెంటిమెంట్ ఉండడంతో చాలమందిని స్థానికులే అడ్డుకోవడం విశేషం.


ఏపీ మహిళకు సెగ :


ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాధవి అనే మహిళ‌ తన కుటుంబంతో సహా అయ్యప్పను చూసేందుకు బయల్దేరింది. అయితే ఆమెను దారి మధ్యలోనే ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు సైతం పెద్దగా రక్షణ కల్పించలేకపోవడం గమనార్హం. మొత్తానికి ఆమె ఎలగైనా వెళ్దామనుకున్నా నిరసన సెగకు భయపడి వెనక్కిపోవాల్సివచ్చింది. ఇదే తీరులొ మరికొందరికీ జరిగింది.


ప్రభుత్వానికి సవాల్ :


ఇదిలా ఉండగా అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశం ఇపుడు మహీళలకు, మూఢ భక్తులకే కాదు. అక్కడ ఉన్న వామపక్ష ప్రభుత్వానికి కూడా సవాల్ గా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీం కోర్ట్ తీర్పును అమలు చేసి తీరుతామని శపధం చేసిన కేరళ ముఖ్యమంత్రి  పినరయ్ విజయన్  శాంతి భద్రతల సమస్యగా దీనిని చూస్తున్నారు. అయినా అక్కడ పోలీసులు సైతం సెంటిమెంట్ వైపే మొగ్గు చూపడం విశేషం.


హేతువాదుల దూకుడు:


మరో వైపు ఈ సమస్య కేవలం ఆధ్యాత్మికపరంగా కాకుండా నమ్మకాలు, మూఢత్వం అన్న చర్చ వైపుగా మళ్ళుతోంది. హేతువాదులు దేవుడే లేడంటూనే మహిళల ప్రవేశానికి మద్దతు ఇస్తున్నారు. మరో వైపు ఫెమినిస్టులు ఈ సమస్యను వారి కోణంలో నుంచి చూస్తున్నారు. హిందు ధార్మిక సంఘాలు  మరో వైపు నిలబడడం తో ఇది మెల్లగా రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. మొత్తానికి సుప్రీం తీర్పుని రివ్యూ చేయనని కేరళ ప్రభుత్వం  అంటూంటే, అడ్డుకుని తీరుతామని హిందూ సంఘాలు అంటున్నాయి.


మరో నాలుగు రోజులు :


 సుప్రీం తీర్పు అమలు మాత్రం తొలి రోజు జరగకపోగా ఉద్రిక్త‌లతో అంతా టెన్షన్ వాతావర‌ణం నెలకొంది. పాలకులు రెండు వైపులా కూర్చోబెట్టి సామరస్యంగా వ్యవహారం తార్కిక ముగింపునకు తీసుకురాకుండా సిద్ధాంతబధ్ధంగా  వ్యవహరించాలనుకోవడంతోనే కొత్త సమస్యలు వస్తున్నాయి.ఈ నెల 22 వరకు శబరిమల ఆలయం తెరచి ఉంటుంటుంది. రేపటి నుంచి మరెన్ని ఆందోళనలు చూడాలో.


మరింత సమాచారం తెలుసుకోండి: