జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన జ‌న‌సేన క‌వాతు కార్యక్రమం ఏపీ రాజకీయాలలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కార్యక్రమానికి చాలా మంది యువత హాజరవ్వడంతో జనసేన పార్టీకి చెందిన నాయకులు మరియు కార్యకర్తలు తమ పార్టీ భవిష్యత్తు రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Image may contain: 3 people, people on stage and people standing

ఇదే క్రమంలో జ‌న‌సేన క‌వాతు సక్సెస్ కావడంతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు తర్వాత రోజు. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజీ పై ఎప్పుడూ ఎన్నడూ లేనివిధంగా బ్యారేజీ నిండా జనసంద్రం మొత్తం నిండిపోవడంతో పవన్ కళ్యాణ్ బ్యారేజీపై వస్తుండగా తీవ్ర తోపులాట జరిగింది.

Image may contain: 6 people, people smiling, crowd and outdoor

ఇదే క్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛందంగా తమకు తాము క్రమశిక్షణగా వ్యవహరించడంతో ఎటువంటి తొక్కిసలాట జరగలేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పిలుపుకు యువత మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నదేమో అన్నట్టుగా జ‌న‌సేన క‌వాతు కార్యక్రమం కనబడింది.

Image result for PAWAN KALYAN KTR

ఈ క్రమంలో కార్యక్రమం మొత్తం సక్సెస్ కావడంతో తెలంగాణ మంత్రి టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు అనే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వినపడుతున్న టాక్. అంతేకాకుండా గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్పాటు చేద్దామనుకున్న ఫెడరల్ ఫ్రంట్ కు పవన్ బహిరంగంగానే మద్దతిస్తాం అని ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో కేటీఆర్ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేయడంతో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: