తెలుగుదేశం ప్రభుత్వ వ్యవహారం చూస్తే అధికార యంత్రాంగం మొత్తం పార్టీ ప్రతినిధుల సేవలోనే తరిస్తూ, వారి దుర్మార్గాలకు ధౌష్ట్యాలకూ బాసటగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంది. అమరావతిలో ప్రజలపై తెలుగుదేశం రౌడీ ఆగడాలకు అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. పోలీసు యంత్రాంగమంతా తమ ఉద్యోగ బాధ్యతలను ప్రజా రక్షణ మానేసి నాయకుల కు బాసటగా ఉంటున్నాట్లు రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాల ద్వారా అర్ధమౌతుంది. పోలీసు స్టేషణ్లు ఈ మద్య నేరపరిరక్షణ బాధ్యతలు తీసుకున్న దాఖలాలే కనిపిస్తున్నాయి.

అధికార పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఉమతో పాటు ఆయన భార్య సహా 9 మందిపై చర్యలు తీసుకోవా లని విజయవాడ పోలీసులకు ఆదేశించింది. 
Image result for bonda uma high court
నకిలీ డాక్యుమెంట్లు, పోర్జరీ ఆరోపణలతో బోండా ఉమ పై గతంలో రామినేని కోటేశ్వరరావు అనే వ్యక్తి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన ఫిర్యాదును పట్టించు కోవడం లేదని, ఎన్ని రోజులు గడిచినా చర్యలు తీసుకోవడం లేదంటూ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఉమ తో పాటు ఈ కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.
Image result for bonda uma ramineani koteswara rao case
విజయవాడలో ఒక భూవ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే ఉమకు రామినేని కోటేశ్వరరావు అనే వ్యక్తికి విభేదాలు తలెత్తాయి. దీంతో అతడు విజయవాడ పోలీసులను  ఆశ్రయించారు. అయితే అధికార ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోడానికి పోలీసులు వెనకడుగు వేయడంతో కోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పైవిధంగా ఆదేశించింది. 


బోండా శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి : సిపిఎం


ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంలో ఎంఎల్‌ఎ బొండా దంపతులతో సహా 9 మందిపై చర్యలకు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎంఎల్‌ఎ బొండా ఉమామహేశ్వరరావు శాసనసభ సభ్యత్వాన్ని తక్షణం రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు.


విజయవాడలోని శ్రీశ్రీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బోండా ఉమను పార్టీ, ఎంఎల్‌ఎ పదవుల నుండి తొలగించాలని కోరారు. బోండా ఉమా అవినీతి అక్రమాలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి చంద్ర బాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సమగ్ర విచారణకు సిఎం ఆదేశించాలని కోరారు.


బోండా ఉమ అవినీతి అక్రమ వ్యవహారాలు ఇంకా నగరంలో అనేకం ఉన్నాయన్నారు. వీటన్నింటిపైనా సమగ్ర విచారణ జర పాలని డిమాండ్‌ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: