చంద్రబాబునాయుడు మాటలు విచిత్రంగా ఉంటున్నాయి. ప్రకృతిని కంట్రోలు చేయగలుగుతున్నా  రాజకీయాలను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నట్లు రెండు రోజుల క్రితమే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అసలు ప్రకృతిని కంట్రోల్ చేయటమేంటో చంద్రబాబుకే తెలియాలి. వాతావరణంలో మార్పులను ముందే తెలుసుకోగలుగుతున్నారు. తుపానులను ముందే తెలుసుకోగలుగుతున్నారు. అదంతా శాటిలైట్ పరిజ్ఞానంతో జరుగుతోందన్న విషయం అందరికీ తెలిసిందే.


శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు బాధితులతో మాట్లాడుతూ త్వరలో సముద్రాన్ని కూడా కంట్రోలు చేయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు మాటలతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. సముద్రాన్ని కంట్రోల్ చేయటమన్నది బహుశా వారు మొదటిసారి వినుంటారు. అందుకే అంతలా ఆశ్చర్యపోయారు. అయితే, సముద్రాన్ని ఏ విధంగా కంట్రోల్  చేద్దామనుకుంటున్నారో మాత్రం చెప్పలేదు లేండి.

 

తరచూ తుపానులకు కారణమవుతున్న సముద్రాన్ని కంట్రోల్  చేయటం ద్వారా విపత్తులను నివారించవచ్చని చెప్పారు. తుపాను వచ్చే ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్ట నివారణను తగ్గించవచ్చు కానీ అసలు తుపానులే రాకుండా సముద్రాన్ని కంట్రలో చేయటమేంటో పాపం అక్కడున్న వారికి ఎవరికీ అర్ధం కాలేదు. తరచూ చంద్రబాబు ఇలాగే మాట్లాడుతున్నారు. అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహిస్తానని, వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్ గా రూ 100 కోట్లు ఇస్తానని చెప్పటం చంద్రబాబుకే చెల్లింది.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: