ఈసారి కోస్తా నుంచి ముఖ్యమంత్రి అవుతారా. తెర వెనక అలా ప్రయత్నాలు జరుగుతున్నాయా. అలా అయితే ఎవరు సీఎం అవుతారు. అసలు కోస్తాలో అంత బలమైన నేత ఎవరు ఉన్నారు. ఇవన్నీ ప్రశ్నలే కానీ సమాధానాలు అంత ఈజీ కాదు. అయితే ఇలా నినాదాలు ఇచ్చుకోవడంలో తప్పు లేదు, పెద్ద ఖర్చు కూడా కాదు. దానికోసమే ఇపుడు జరుగుతోందంతా.


కాంగ్రెస్ నినాదమట :


రెండు దశాబ్దాలుగా సీమ సీఎంలను భరిస్తున్నారు. ఈసారి కోస్తా నుంచి సీఎం ని ఎన్నుకుందాం, ఇదీ కాంగ్రెస్ సరికొత్త నినాదం. మరి ఈ మహత్తరమైన ఆలొచన ఎవరిదో కాదు. రాయసీమకు చెందిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిదట. ఆయన ఈ ఆలొచనను తొందరలోనే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధి చెవిన వేసి ఆయన గారి ఆమోదం కూడా తీసుకుని జనంలోకి తీసుకుపోతారట.


వర్కౌట్ అవుతుందా :


నిజానికి ఉమ్మడి ఏపీలోనే సీమ నేతలు హవా చాటుకున్నారు. ఎక్కడో అన్న నందమూరి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి లాంటి వాళ్ళు తప్పించి చాలామంది సీమ నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక నందమూరి 1995లో వెన్నుపోటుకు గురి అయ్యాక సెప్టెంబర్ 1న‌ గద్దెన్నెక్కిన చంద్రబాబు మొదలుకుని ఇప్పటివరకూ అంటే  దాదాపు పాతికేళ్ళుగా సీమ నేతలే సీఎంలు అవుతున్నారు. అది అలా జరిగిపోతోంది కూడా.


వాళ్ళ మధ్యనే పోటీ :


ఇక చూసుకుంటే మరో మారు వాళ్ళ మధ్యనే పోటీ ఉండేలా కనిపిస్తోంది. అటు వైసీపీ చీఫ్ జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ చిత్తూర్, కడపలకు చెందిన నాయకులే. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సీఎం అవుతారని ఇప్పటికే  ప్రచారంలో ఉంది. ఈ టైంలో కాంగ్రెస్ కోస్తా నినాదం ఎవరికి మేలు చేస్తుందన్న చర్చ సాగుతోంది. అలా చూసుకుంటే కోస్తాలో  నాయకుడిగా పవన్ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చే ఆ పిలుపు అటు తిరిగి ఇటు తిరిగి పవన్ కి హెల్ప్ చేస్తుందా అంటున్నారు. ఇక బాబుతో రహస్య మైత్రిని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ఇలా ఆయనకే చేటు  చేసేలా నినాదాలు అందుకుంటే అసలుకే ఎసరు వస్తుందని కొంతమంది కాంగ్రెస్ నేతలే అంటున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: