లేద‌లేదంటూనే ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ ఎన్నిక‌ల‌ను శాసిస్తున్నారు! ఆశ్చ‌ర్యం అనిపించినా ఇది నిజం. ఆయ న ప్ర‌తి విష‌యంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట‌కు తెర‌లేపిన తెలంగాణాలో.. టీడీపీ ప‌రిస్తితి ఏంటి?  టీడీపీ ఎలా ముందుకు వెళ్తుంది?  జాతీయ పార్టీగా దీనిని దేశ‌వ్యాప్తంగా ముందుకు తీసుకు వెళ్లా ల‌ని బావించిన చంద్ర‌బాబు తెలంగాణాలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. దీనికి ఆయ‌న త‌న దైన శైలిలో స్పందించారు. నాకు తెలంగాణ ఎన్నిక‌ల‌కు సంబంధం లేద‌న్నారు. అంతేకాదు, ఎవ‌రితో పొత్తులు పెట్టుకోవాలో ? ఎన్ని సీట్ల‌లో పోటీ చేయాలో కూడా త‌న‌కు సంబంధం లేద‌ని.. అంతా కూడా తెలంగాణ టీడీపీ నాయ‌కులు చూసు కుంటార‌ని ఆయ‌న మీడియా ముఖంగా చెప్పారు. 


అయితే, తెలంగాణ ప్ర‌భుత్వాధినేత, టీఆర్ ఎస్ నాయ‌కుడు కేసీఆర్ మాత్రం తెలంగాణ రాజ‌కీయాల‌ను చంద్ర‌బాబు శా సిస్తున్నాడ‌ని, ఆయ‌న మ‌హాకూట‌మి పేరుతో కాంగ్రెస్‌తో క‌లిసి జ‌ట్టుగా ముందుకు వెళ్తున్నాడ‌ని ప‌దే ప‌దే చెప్పారు. ఇ క‌, ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌తి సంద‌ర్భంలోనూ, ప్ర‌తి స‌భ‌లోనూ వెల్ల‌డిస్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిని లై ట్‌గా తీసుకున్న రాజ‌కీయ నాయ‌కులకు ఇప్పుడు బ‌ల‌మైన ఆధారం ల‌భించింది. రిమోట్ కంట్రోల్‌తో ఎల‌క్ట్రానిక్ వ స్తువుల‌ను న‌డిపించిన‌ట్టుగా.. చంద్ర‌బాబు ఏపీలోనే ఉన్నా.. తెలంగాణ రాజ‌కీయాలు ఇక్క‌డ నుంచే న‌డిపిస్తున్నార‌న డానికి బ‌ల‌మై న ఆధారాలు ల‌భించాయి. హైద‌రాబాద్‌లో కీల‌క‌మైన‌ అంబర్‌పేట నియోజకవర్గం టికెట్‌ను ఎవరికి కేటాయించాలనే దానిపై  చంద్రబాబు నాయుడు స్వయంగా సర్వే చేయించినటు ప్రచారం జరుగుతోంది. 


కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించ డంతో టీడీపీ సర్వేకు ప్రాధాన్యం సంతరించుకుంది. స్వయానా అధినేత ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో టికెట్‌ ఆశిస్తున్న నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు. మహాకూటమిలో భాగంగా అంబర్‌పేట నియోజకవర్గాన్ని టీడీపీకే కేటాయి స్తా రన్న బలమైన ప్రచారం జరుగుతోంది. కిషన్‌రెడ్డి విజయయాత్రకు బ్రేక్‌ వేసి ఈ సారి ఇక్కడ పాగా వేయాలని టీడీపీ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. టీడీపీ, బీజేపీల మధ్య మిత్ర బంధం బీటలు వారడంతో ఈ నియోజకవర్గాన్ని తెలుగు దేశం అధినాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిసింది.  


ఇక్కడ ఎవరు బలమైన అభ్యర్థి అని పార్టీ అధినేత చంద్రబాబు 4 విడతలుగా సర్వే చేయించినట్లు తెలిసింది. ఈ ని యోజకవర్గంలో సుమారు 100 మంది వరకూ టీడీపీ క్రియాశీలక సభ్యులు ఉన్నారు. వారందరికీ అమరావతి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి ఫోన్‌లు వచ్చినట్లు తెలిసింది. కాల్‌ వచ్చినప్పుడు ‘‘ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వే.. అంబర్‌పేట నియోజకవర్గం టికెట్‌ ఎవరికి ఇస్తే పార్టీ విజయం సాధిస్తుంది... ఒక పేరు చెప్పి... ఓకే అయితే ఒకటి నొక్కండి. మరో పేరు చెప్పి ఇష్టమై రెండు నొక్కండి’ అని వాయిస్‌ మెసేజ్‌ వస్తోంది. దీనికి ప్ర‌జల నుంచి స్పంద‌న ఎలా ఉంద‌నేది ప‌క్క‌న పెడితే.. చంద్ర‌బాబు మాత్రం తెలంగాణ ఎన్నిక‌ల్లో కీల‌క‌రోల్ పోషిస్తున్నార‌న్న కేసీఆర్ వ్యాఖ్య లు మాత్రం నిజ‌మ‌వుతున్నాయి. మ‌రి దీనికి టీడీపీ నేత‌లు ఏం సమాధానం చెబుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: