తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు ద్వంద్వ రాజ‌కీయాలు చేస్తున్నారా?  ఒక‌ప‌క్క ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతూనే.. మ‌రో ప‌క్క కేసీఆర్ పై న్యాయ‌పోరాటానికి దిగారా?  అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌లనుప్ర‌శ్నించిన కాం గ్రెస్ నాయ‌కుల‌కు కేసీఆర్ స‌రైన స‌మాధానం చెప్ప‌క‌పోగా.. మీవ‌ల్లే నేను ముంద‌స్తుకు వెళ్తున్నానంటూ.. ఆయ‌న ఆన్స రిచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయ‌కులు విష‌యాన్ని కోర్టుల వ‌ర‌కు తీసుకు వెళ్లారు. అయితే, హైకోర్టులో కాంగ్రెస్ వాద‌న‌కు చుక్కెదురు అయింది. దీంతో విష‌యాన్ని ఇక్క‌డితో విడిచి పెట్ట‌కుండా.. సుప్రీం కోర్టు వ‌ర‌కు తీసుకు వెళ్లారు. మ‌రోప‌క్క‌, ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్నారు. ఇదేం విధానం అని ప్ర‌శ్నించే నాథుడు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డంపై ప్ర‌శ్నిస్తున్న కాంగ్రెస్ నేత‌లు. ఎందుకు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.


సెంబ్లీ రద్దుపై వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించటాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అరుణ వేసిన ఎస్‌ఎల్పీపై ఈ నెల 22న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ అరుణ హైకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేశారు. శాసనసభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకు అసెంబ్లీ రద్దుకు ముందు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి సభను సమావేశపరిచే అధికారం గవర్నర్‌కు ఉన్నా.... ఆయన ఆ పని చేయలేదని పిటిషనర్‌ ఆరోపించారు. ఆర్టికల్‌ 174 ప్రకారం, సభ్యుల ప్రమేయం లేకుండా సీఎం అప్రజాస్వామికంగా సభను రద్దు చేస్తుంటే అడ్డుకునే అధికారం గవర్నర్‌కు ఉందని పేర్కొన్నారు. 


రద్దుకు ముందు అసెంబ్లీని సమావేశపరిస్తే.. గవర్నర్‌ చర్య ప్రజాస్వామ్యయుతంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఓకే ఇదే విష‌యం- అనుకుందాం. అయితే, అసెంబ్లీ ర‌ద్దుపై పోరాడుతున్న కాంగ్రెస్ మ‌రోప‌క్క ఎందుకు మ‌హాకూట‌మి పేరుతో హ‌డావుడి చేస్తోంది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అంటే కోర్టుల‌పై న‌మ్మ‌కం లేద‌నా?  లేక తాము చేస్తున్న వాద‌న‌లో ప‌స‌లేద‌ని, కేసీఆర్ ప్ర‌భుత్వం కాబ‌ట్టి ఆయ‌న‌కు  ఆప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంద‌ని తెలిసి కూడా నాట‌కాలు ఆడి.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మా? ఇవే ఇప్పుడు తెలంగాణాలో ప్ర‌ధాన ప్ర‌శ్న‌లుగా మెదులుతున్నాయి. ఏదైనా ఒక విష‌యంపై నిజాయితీగా పోరాడాలి. కానీ, గెలుస్తామో లేదో న‌నే సొంత భ‌యం చంక‌లో పెట్టుకుని కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నార‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: