కొంతమంది కొన్ని సందర్భాలను  బట్టి హైలెట్ అయిపోతారు. వారు టెకప్ చేసిన కేసులు కూడా వారిని అలా ముందుకు తీసుకుపోతాయి. సెలిబ్రిటీని  మించి ఇమేజ్ ని క్రియేట్ చేస్తాయి. ఇపుడు అటువంటి స్టాటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఓ మాజీ పోలీస్ అధికారి రేపటి అడుగులు ఎటువైపు అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.


ఆ పార్టీ వైపేనా :

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతారని చాలాకాలంగా అనుకుంటూ వస్తున్నదే. ఆయన చేరికపై అప్పట్లో అంతా ఒకే మాట అనేవారు. ఎలాగూ జగన్ కేసులు ఆయనే టకప్ చేశారు కాబట్టి రాజకీయాల్లో జగన్ శత్రువు పాటీ అయిన టీడీపీ నుంచే ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంటుందని భావించారు. ఆ తరువాత తాను సామజిక సేవకే పరిమితమని ఈ మాజీ పోలీస్ అధికారి చెప్పడంతో కొంత కాలం ఆ ప్రచారం ఆగిపోయింది.  రీసెంట్ గా  మళ్ళీ మాజీ జేడీ టీడీపీలో చేరుతున్నారని ప్రచారం ఊపందుకుంది.


బాబును కలిసారట :


టీడీపీ చీఫ్ చంద్రబాబు ని మాజీ జేడీ కలిసారని కూడా టాక్ నడుస్తోంది. ఆయన ఈ మధ్య తాను తొందరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించడంతో మరో మారు  పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో బాబు ని కలిసారన్న ప్రచారమూ తోడవుతోంది. ఇంతకీ ఈ మాజీ పోలీస్ ఎందుకు కలిసారన్నది తెలియక పోయినా ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలో ఉంటారని అంటున్నారు. 


సీమ నుంచేనా :


రాయలసీమకు చెందిన ఈయనను అక్కడే ఓ కీలకమైన ఎంపీ సీటు నుంచి టీడీపీ తరఫున నిలబెడతారని అంటున్నారు. వైసీపీకి స్టాంగ్ హోల్డ్ ఉన్న చోట ఈ మాజీ జేడీని నిలబెట్టడం ద్వార జగన్ కి సరైన పోటీ ఇవ్వాలనుకుంటున్నారని అంటున్నారు. అదే జరిగితే ఈ సమరం మామూలుగా ఉండదని కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా జేడీ కనుక టీడీపీలో చేరితే జగన్ పార్టీకి లాభమా నష్టమా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: