రాహుల్ గాంధీ ని బీజేపీ వారు పప్పు పప్పు అనేవారు. కానీ ఇప్పడూ రాహుల్ పప్పు కాదు బీజేపీ ని బాగా ఇబ్బంది పెట్టె వ్యహా రచనలు చేస్తూ అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు.  తాజాగా మీటూ పేరుతో లైంగిక వేధింపుల గురించి దేశవ్యాప్తంగా మహిళలు గళమెత్తుతున్న సమయంలో.. అధికార భాజపా డిఫెన్సులో పడేలా రాహుల్ పావులు కదిపినట్లుగా కనిపిస్తోంది. ‘మీటూ’ వ్యవహారాలు దాదాపుగా అన్ని రంగాలనూ కుదిపేస్తున్నాయి.

మోడీ టీమ్ ను డిఫెన్స్ లో పడేసిన రాహుల్!

సినిమా రంగంలో ఇలాంటి వయవహారాలకు కొదవలేదు. ఈ ఎపిసోడ్ లో జర్నలిజం కు సంబంధించి కూడా అనేకమంది గళమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుతం కమలదళంలో కొనసాగుతూ కేంద్రమంత్రి పదవిని కూడా వెలగబెడుతున్న ఎంజె అక్బర్ కూడా ఉన్నారు. ఆయన చుట్టూ ఇలాంటి మీటూ వేధింపుల విమర్శలు అనేకం ముసురుకున్నాయి. ఆ సమయానికి ఆయన విదేశాల్లో ఉండగా.. రాగానే మంత్రిపదవిపై వేటు పడుతుందని అంతా భావించారు. అయితే ఆయన ఎంచక్కా విదేశాల నుంచి, ప్రధానిని కలిసిన తర్వాత  కూడా మంత్రిగా కొనసాగారు.

Image result for modi and rahul gandhi

ఈలోగా యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకుడిపై కూడా మీటూ ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆయన మీద తక్షణ చర్యలు తీసుకుంది. పదవికి రాజీనామా చేయించింది. నిజానికి అంతకంటె పెద్ద ఆరోపణలు ఎదుర్కొన్న అక్బర్ విషయంలో భాజపా ఉపేక్ష వహించడం వారికి మచ్చతెచ్చేలా తయారైంది. ఆ రకంగా రాహుల్ వారిని డిఫెన్సులో పడేశారు. ఇక భాజపాకు గత్యంతరం లేకుండాపోయింది. అక్బర్ తో తన మంత్రిపదవికి రాజీనామా చేయించింది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి.. కేవలం మత్రిపదవిని ఊడగొట్టడంతోనే సరిపెట్టకుండా.. ఎంజె అక్బర్ తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: