తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న క్రమంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన హామీల విషయంలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు పై ఏపీ రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత నెలకొంది.

Related image

ఒకానొక సమయంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బెటర్ అని కామెంట్లు చేసిన చంద్రబాబు...ఏపీలో ప్రజలంతా ఆంధ్ర కి ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్మడంతో..చంద్రబాబు స్పెషల్ స్టేటస్ నిర్ణయంపై యూటర్న్ తీసుకుని ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఇప్పుడు కళ్ళు తెరిచారు.

Image result for chandrababu

ఈ క్రమంలో కేంద్ర రాష్ట్రంపై ఒత్తిడి తీసుకురావడానికి  వినూత్నంగా ఆలోచించారు చంద్రబాబు.ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా మీ..టూ ప్ర‌కంప‌న‌లు రేపుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ మీ..టూ దెబ్బ‌కి ఏకంగా కేంద్ర‌మంత్రి ఎంజే అక్బ‌ర్ రాజీనామా చేయ‌డంతో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

Image result for chandrababu

దీంతో మీ..టూ త‌ర‌హా ఉధ్య‌మాన్ని తెర‌పైకి తెచ్చి చంద్ర‌బాబు బీజేపీ పై ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ పై ఒత్తిడి తేవాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం. మ‌రి చంద్ర‌బాబు ప్లాన్ తెర పైకి వ‌స్తే ఎలాంటి సంచ‌నాలు సృస్టిస్తుందో చూడాలి. ఈ నిర్ణయం వల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మైలేజ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: