పవన్ కళ్యాణ్ తుఫాను భాదితుల విషయం లో కూడా తన స్వంత డబ్బాను కొట్టుకోవడం మానడం లేదు. మరీ తన మాటలు చీప్ గా తయారవుతున్నాయి.  తిత్లీ బాధిత ప్రజలను ఆదుకునే విషయంలో రకరకాల ప్రతిపాదనలు చెబుతున్న పవన్ కల్యాణ్ తాను చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలబెట్టిన మనిషిని అని అందుకే సహాయం కోరుతున్నానని అంటున్నారు. ఇలాంటి కామెంట్ ద్వారా ఆయన ఏం ఉద్దేశిస్తున్నారో అర్థం కావడం లేదు.


తన అజ్ఞానాన్ని మళ్ళీ బయటికి పెట్టుకున్న పవన్...!

పరోక్షంగా తనవల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు అని ఆయన చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికి కొన్ని వందల సార్లు చెప్పుకున్నారు కూడా. అదొక్కటే తనకు రాజకీయ అర్హత అయినట్లుగా కూడా ఆయన భావిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. బాధితులకు సాయం అర్థించడానికి ప్రభుత్వాన్ని నిలబెట్టిన మనిషి మాత్రమే అయిఉండాలా? అనే సందేహం  ప్రజలకు కలుగుతోంది.

తన అజ్ఞానాన్ని మళ్ళీ బయటికి పెట్టుకున్న పవన్...!

ఇదేం మాట ఇది. ప్రభుత్వాన్ని నిలబెట్టిన మనిషి ఆయన కాకపోతే.. సహాయాన్ని కోరరా? లేదా, ప్రభుత్వాన్ని నిలబెట్టకపోయిన వారికి సహాయం అర్థించే అధికారం లేదా? అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి బాధితులకు సాయం అడగడానికి లేదని పవన్ చెబుతున్నట్లుగా ఉంది. పవన్ చెబుతున్న మాటలు ఎలా ఉంటున్నాయంటే.. ప్రభుత్వం నిలబడడానికి ఓట్లు వేసిన వారికి మాత్రమే సహాయం అడిగేహక్కు ఉంటుంది. ఓటు వేసి ప్రభుత్వం ఏర్పడడానికి సహాయం అడిగే హక్కు ఉండదు.. అన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. ప్రజాస్వామ్యం యొక్క మౌలికమైన స్ఫూర్తిని కూడా అర్థం చేసుకోకుండా పవన్ మాట్లాడుతున్న మాటలు చిత్రంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: