శ్రీకాకుళం జిల్లా లో వచ్చిన తిత్లీ తుఫాను ఏపీ రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టిస్తోంది. ఉత్తరాంధ్రలో తిత్లీ తుఫాను వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారు ఇదే క్రమంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తుపాను బాధితులకు అండగా నిలబడి కొంత మేర సాయం చేస్తూ అధికారంలో ఉన్న టిడిపి నాయకులు తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రజలకు ధైర్యం ఇస్తున్నారు.  

Image result for chandrababu thithili

ఇదే క్రమంలో ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న విపక్ష పార్టీలకు కౌంటర్లు కూడా వేస్తున్నారు టిడిపి నాయకులు. తాజాగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రతిపక్ష నేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image result for jagan  chinarajappa

విజ‌యన‌గ‌రం జిల్లాలో పాద‌యాత్ర చేస్తూ ప‌క్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వ‌ర‌ద బాదితుల ద‌గ్గ‌రికి వెళ్ళి జ‌గ‌న్ ఎందుకు పరామ‌ర్శంచ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఊరికే అధికార టీడీపీ పై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పా జ‌గ‌న్‌కి ప్ర‌జ‌ల క‌ష్టాలు ఏం తెలుస‌ని మండిప‌డ్డారు చిన‌రాజ‌ప్ప‌.

Related image

ఎప్పుడెప్పుడు సీయం అవుదామా అనే తీర‌ని ఆశ త‌ప్ప‌.. జ‌గ‌న్‌లో నాయ‌కుడి ల‌క్ష‌ణాలు మాత్రం కొంచెమైనా క‌న‌బ‌డ‌డం లేద‌ని చిన‌రాజ‌ప్ప విమ‌ర్శ‌లు చేశారు.  మరియు అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా జగన్ పై మండిపడ్డారు. ఒక‌వైపు పాద‌య‌త్ర‌లో భాగంగా ముద్దులు పెడుతూ.. మ‌రోవైపు ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రు అయ్యే జగన్‌కు శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ బాధితులను పరామర్శించేందుకు మాత్రం తీరిక దొరకలేదా.. అన్ని ప్రశ్నిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: