జనసేనను మొదట్లో తక్కువగా అంచనా వేసిన వారు ఇపుడు సర్దుకుంటున్నారు. ఏం కాదులే అనుకుని ధీమాగా ఉన్న వారు ఉలిక్కిపడుతున్నారు. ఆ పార్టీకే నష్టమని అంచనా వేసిన వారు ఇపుడు తమ సొంత ఇంటి వైపు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి చూసుకుంటే వాళ్ళూవీళ్ళని కాకుండా అన్ని పార్టీలకు జనసేన బాగానే దెబ్బేసేస్తోంది.


వైసీపీకి షాక్ :


జనసేన దూకుడుతో వైసీపీకి  గట్టి దెబ్బ పడుతోంది. ఆ పార్టీ  వల్ల ఏం లేదులే అని పెద్దగా పట్టించుకోని ఫ్యాన్ పార్టీకి షాకులు బాగా తగులుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచే ద్వితీయ శ్రేణి లీడర్లంతా జనసేనలోకి జంప్ అయిపోతున్నారు. విశాఖలో సీనియర్ మహిళా నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ హటాత్తుగా జనసేనలో చేరడం మామూలు విషయం కాదు. అదే బాటలో మరికొందరు ద్వితీయ, త్రుతీయ శ్రేణి లీడర్లు ఉన్నారని టాక్ నడుస్తోంది.


ఆ జిల్లాలలోనూ:


గోదావరి జిల్లాల్లో చూసుకుంటే ఎక్కువ నష్టం ఇప్పటికైతే వైసీపీకే జరిగిందని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు రాపాక ప్రసాదరావు, రాజేశ్వరి వంటి వారు తూరుపు గోదావరి నుంచి పార్టీని వీడిపోయారు.  పశ్చిమ నుంచ్ లేటేస్ట్ గా భీమవరం రాజు గారు అల్లూరి పార్టీకి గుడ్ బై కొట్టేశారు. ఇదే వరసలో మరింతమంది తయారుగా ఉన్నారు. వీరి అందరి కంటే ముందు పితాని బాలక్రిష్ణ పార్టీని వీడి జనసేన తరఫున టికెట్ కూడా సంపాదించారు.


ఆశాకిరణమా :


జనసేనకు అసలు పార్టీ యంత్రాంగం పెద్దగా లేదు. దాంతో వారు టీడీపీ, వైసీపీల మీదనే ఆధారపడ్డారు. పై రెండు పార్టీల నుంచి వీలైనంతమంది నాయకులను తీసుకోవడం ఇందులో భాగనే, అయితే అధికారం చేతిలో ఉండడం వల్ల టీడీపీ నుంచి తొందరగా జంపింగులు జరగడం లేదు. అదే టైంలో వైసీపీలో కుదుపులు, ఇంచార్జ్ ల మార్పు, జగన్ ఒంటెద్దు పోకడలు వరసి జనసేనకు అస్త్రాలను అందిస్తున్నట్లుగా ఉన్నాయి.


చూస్తూ ఊరుకుంటే :


ఇక జనసేన ఇదే దూకుడు కొనసాగిస్తే మొదటి దెబ్బ వైసీపీకే పడిపోతుందని అంటున్నారు. . ఇప్పటికి అయింది చాలు, ఇక ఉపేక్షిస్తే మాత్రం పెద్ద తలకాయలు కూడా వైసీపీని వీడే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికైనా అధినాయకత్వం అసంత్రుప్త  నాయకులను బుజ్జగించి వారికి చెప్పాల్సింది చెప్పి దారిలోకి తెచ్చుకోకపోతే ఎన్నికల వేళ పార్టీ యావత్తూ డొల్లగా మారిపోయే స్థితి వస్తుందని అంటున్నారు. మరి జాగ్రత్త పడతారా.


మరింత సమాచారం తెలుసుకోండి: