ముందస్తు  ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. పోయిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున ఎల్బి నగర్ నియోజకవర్గం నుండి గెలిచిన ఆర్ కృష్ణయ్య త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. టిడిపి ఎంఎల్ఏగా కన్నా బిసి ఉద్యమ నేతగానే కృష్ణయ్య బాగా పాపులర్. పోయిన ఎన్నికల్లో గెలిచింది టిడిపి నుండే అయినా ఏనాడు పార్టీ ఎంఎల్ఏగా చెప్పుకోలేదు. అదే సందర్భంలో చంద్రబాబునాయుడు కూడా కృష్ణయ్యను టిడిపి ఎంఎల్ఏగా లెక్కేయలేదు. అందుకనే తాజాగా పొత్తుల్లో భాగంగా తమకు కావాల్సిన సీట్ల జాబితాను కాంగ్రెస్ కు టిడిపి అందించింది. అందులో కృష్ణయ్య పేరు లేకపోవటమే ఉదాహరణ.

 Image result for janareddy and krishnaiah

సరే ప్రస్తుత విషయానికి వస్తే కృష్ణయ్యను కాంగ్రెస్ లోకి చేరాలంటూ సీనియర్ నేత జానారెడ్డి ఆహ్వానించారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి తెలంగాణా ఇన్చార్జి కుంతియా కూడా ఉద్యమ నేతతో మాట్లాడారు. ఉద్యమ నేత కూడా కాస్త సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. నిజానికి వచ్చే ఎన్నికల్లో బిసి సంక్షేమ సంఘం తరపున బిసిల కోసం ఓ పార్టీ పెట్టాలన్నది కృష్ణయ్య ఆలోచన. అయితే పార్టీ పెట్టటం, గుర్తు సంపాదించటం లాంటివి ఇప్పటికిప్పుడు సాధ్యా కాదు. అందుకని ఏం చేయాలనే ఆలోచనలో కృష్ణయ్య ఉన్నపుడు అనూహ్యంగా కాంగ్రెస్ నుండి ఆఫర్ వచ్చింది.

 Related image

 అయితే, ఆఫర్ తో పాటు సమస్య కూడా వచ్చింది. అదేమిటంటే, కృష్ణయ్య ఎల్బీ నగర్ సిట్టింగ్ ఎంఎల్ఏ. ఈ సీటులో అభ్యర్దిగా కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. కృష్ణయ్యేమో తనకు ఇదే నియోజకవర్గం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కుదరదంటోంది. మరి ఏం చేయాలో రెండు వైపులా అర్ధం కావటం లేదు. అందుకని కృష్ణయ్యకు ఎంఎల్సీ పదవిని ఆఫర్ చేస్తోంది కాంగ్రెస్. మరి తాజా ఆఫర్ కు కృష్ణయ్య ఏమంటారో చూడాలి. అన్నీ సానుకూలమైతే రెండు రోజుల్లో ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: