మరో సర్వే వెలువడింది. ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ  చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది., ప్రధాన ప్రతిపక్ష పాత్ర టీడీపీదేనని క్లారిటీ ఇచ్చేసింది.

బలాబలాలు తారుమారు:


పోయిన ఎన్నికల్లో టీడీపీకి 103 సీట్లు వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఈ సర్వే బట్టి చూస్తే వైసీపీకి 104 సీట్లు వస్తే టీడీపీకి 68 సీట్లు వస్తాయట. ఇక బీజేపీకి అప్పట్లో నాలుగు సీట్లు వస్తే ఇపుడు ఒక్కటి వస్తుందట. మిగిలిన రెండు సీట్లలో జనసేన గెలుస్తుందంట. దీన్ని బట్టి చూస్తే బలమైన ప్రతిపక్షంగా టీడీపీ వస్తుందన్న మాట. అప్పటి బలాలు ఇపుడు రివర్స్ అవుతాయన్నమాట.


ఉత్తర కోస్తాలో ఢీ :


ఈ సర్వే ప్రకారం ఉత్తర కోస్తాలో వైసీపీ, టీడీపీల మధ్య ఢీ అంటే ఢీ అనే సీన్ ఉంటుందట. క్రిష్ణా, గుంటూర్లో  టీడీపీకి ఓట్ల షేర్ 60 శాతం వస్తే వైసీపీకి 40 శాతం వస్తాయి. గోదావరి జిల్లాలో రెండు పార్టీలు సగం సగం ఓట్లు పంచుకుంటున్నాయి. ఉత్తరాంధ్రకు వచ్చేసరికి వైసీపీకి 55 శాతం, టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయట. 


అక్కడ స్వీప్ :


వైసీపీకి పునాదుల్లాటి ఆ జిల్లాల్లో మరో మారు ఆ పార్టీ జయభేరి మోగించడం ష్యూర్ అంటోంది సర్వే. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీకి 70 శాతం ఓట్లు పడితే టీడీపీకి 30 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెప్పింది. నెల్లూర్ అయితే వైసీపీకి 90 శాతం, టీడీపీకి 10 శాతం ఓట్లు, ప్రకాశం తీసుకుంటే వైసీపీకి 60 శాతం, టీడీపీకి 40 శాతం ఓట్ల షేర్ ఉంటుందని సర్వే సమాచారం.


కాంగ్రెస్ కి చుక్కలే:


ఇక కాంగ్రెస్ పరిస్థితి చూసుకుంటే మళ్ళీ సున్నా సీట్లేనని సర్వే చెప్పడం విశేషం. ఇక జనసేనాని ఊపు పోలింగ్ బూతుల్లో పెద్దగా ఉండదని సర్వే చెబుతోంది. రెండు సీట్లు మత్రమే ఆ పార్టీకి ఇచ్చిన సర్వే ఓట్ల షేర్ కూడా పెద్దగా రాదని తేల్చింది. మొత్తంగా చూసుకుంటే భీకర సమరం మాత్రం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీకి మధ్యనే ఉంటుందని సర్వే చెప్పేసింది. మరి చూడాలి అసలు తీర్పు ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: