నాలుగు ప‌దాల‌తో నాలుగు రోడ్ల కూడ‌లిని రంజింప‌జేసి.. న‌లుగురిని మెప్పించి.. నాలుగు కాలాలు నిలిచిపోయే చ‌రిత్రను సృష్టించాడు.. గ‌ద్ద‌ర్‌. కేవ‌లం ద‌క్షిణ భార‌తానికే ప‌రిమిత‌మైనా.. ఆయ‌న ఊపు, దూకుడుతో దేశాన్ని క‌దిలించిన ప్ర‌జా గా యకుడు. ప్ర‌స్తుతం ప‌ది మంది నోళ్ల‌లోనూ నిలుస్తున్న పేరు, చ‌ర్చ‌కు వ‌స్తున్న పేరు కూడా గ‌ద్ద‌ర్‌. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌నుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే, ఇప్ప‌టికే ఆయ‌న మాత్రం త‌న మౌనాన్ని వీడ‌డం లేదు. తెలంగాణాలో కేసీఆర్ పాల‌న పోవాల‌ని బ‌య‌ట‌కు చెప్ప‌లేడు. అలాగ‌ని కాంగ్రెస్‌ను వద్ద‌నీ చెప్ప‌లేని ప‌రిస్తితిల ఉన్న‌డు. ఏదేమైనా.. ఓ న‌డిరోడ్డు కూడ‌లిలో ఉండి కూడా దారి తెన్ను క‌నిపించ‌ని స్థితిలో ఉన్నాడు గ‌ద్ద‌ర్. 

Image result for rahul gandhi gaddar

ఇటీవ‌ల ఓ రోజు రోజంతా.. గ‌ద్ద‌ర్ సోనియాగాంధీని క‌లిశార‌ని, రాహుల్‌తో భేటీ అయ్యార‌ని, ఇంకేముంది ఆయ‌న కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే,  ఆ వెంట‌నే గ‌ద్ద‌ర్ తాను ఏ పార్టీలోనూ చేర‌డం లేద ని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను గ‌మ‌నిస్తే.. వ్య‌వ‌హారం అంతా కూడా గ‌ద్ద‌ర్ భ‌య‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న ఏ పార్టీకి బ‌హిరంగ మ‌ద్ద‌తిచ్చినా.. మ‌రో పార్టీ అధికారంలోకి వ‌స్తే.. నిర్బంధాలు త‌ప్పే ప‌రిస్థితి లేదు. ఇక‌, కేసీఆర్ తో విభేదించే స్థాయి కూడా గ‌ద్ద‌ర్లో క‌నిపించ‌డం లేదు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌లో కేసీఆర్‌పై పైనే పోటీ చేస్తున్నాడ‌ని రాజ‌కీ యాల్లో సంచ‌ల‌నం సృష్టించే వ్యాఖ్య‌లు తెర‌మీదికి వ‌చ్చినా.. గ‌ద్ద‌ర్ లైట్‌గానే తీసుకున్నారు. 

Image result for rahul gandhi sonia gandhi

తాను ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెబుతూనే ఏ పార్టీ త‌ర‌ఫునా తాను చేయ‌బోన‌ని చెప్ప‌డం, అంద‌రూ క‌లిసి త‌నను ఇండి పెండెంట్‌గా నిల‌బెట్టాల‌ని సూచించ‌డం వంటివి గ‌ద్ద‌ర్ గ‌ళం నుంచి విన్నాం. నిజానికి తాను ఏ పార్టీకి మ‌ద్ద‌తివ్వ‌ను అని చెబుతూనే.. తాజాగా భైంసాలో నిర్వ‌హిస్తున్న కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌ను విజ‌యవంతం చేయాల‌ని గ‌ద్ద‌ర్ పిలుపు నివ్వ‌డం గ‌మ‌నార్హం. దేశ ప్రజలను ఏకం చేసే నినాదంతో చేపట్టిన మరో జాతీయ ఉద్యమానికి మద్దతు ప్రకటించినందుకు రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ, నేరుగా ఆయ‌న ఏ పార్టీని విమ‌ర్శించ‌లేకపోవ‌డం చూస్తే.. గ‌ద్ద‌ర్ సంశయం మొత్తం.. కేసులు, నిర్బంధాల‌కు భ‌య‌ప‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఇలా అయితే, ఎలా? అనేది గ‌ద్ద‌ర్ అబిమానుల ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం ఏం ల‌భిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: