ఆ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పార్టీలోనే వర్గ పోరు తీవ్రంగా ఉండడంతో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి చోటుచేసుకుంటోంది. ఎన్నికల వేళ ఇవన్నీ మామూలే అనుకున్నా బలమైన నేతలు పార్టీని వీడితే మాత్రం తీరని నష్టమే కలుగుతుందని హై కమాండ్ తల్ల‌డిల్లుతోంది. రాయబేరాలు కూడా సాగుతున్నాయి.


ఆ ఎమ్మెల్సీపై అనుమానాలు :


విజయనగరం జిల్లాలోని సాలూరు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సొంత పార్టీలో ఆమె ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే ఆర్ పీ భజ్ దేవ్ కి సాలూరు ఎమ్మెల్యే టికెట్ కన్ ఫాం అయిందన్న వార్తతో సంధ్యారాణి వర్గీయులు గుస్సా అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగవద్దని వత్తిడి పెరుగుతోందట.


మంతనాలు మొదలు :


ఇదే అవకాశంగా వైసీపీ నాయకులు కూడా సంధ్యారాణి వద్దకు రాయబేరాలు నడిపారని అంటున్నారు. తన ప్రత్యర్ధికి టికెట్ ఇస్తే పార్టీలో ఉండనని ఇప్పటికే తేల్చి చెప్పిన సంధ్యారాణీని ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో అరకు ఎంపీ సీటుకు టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి కొత్తపల్లి గీత చేతిలో సంధ్య ఓడిపోయారు. ఈసారి ఆమెను వైసీపీ తరఫున పోటీకి పెడతామని ఆ పార్టీ నేతలు అంటున్నారట.


ఆమె రూట్ అదేనా :


ఇక ఇదే విజయనగరం పట్టణానికి చెందిన మహిళా ఎమ్మెల్యే మీసాల గీత పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె సీటుకు ఇపుడు ఏకంగా అ పెద్దాయన అశోక్ పోటీకి వస్తున్నారుట. దాంతో గీత సీటు గోవిందా అవుతుందేమోనని కంగారు పట్టుకుందట. ఈ పరిణామాలతో ఆమె కూడా సైకిల్ దిగేసి జనసేనలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరి మహిళా నాయకులు ఇపుడు అధికార టీడీపీకి ఓ రేంజిలో టెన్షన్ పుట్టిస్తున్నారు. మరి వారిని ఎలా దారికి తెస్తారో చూడాలి మరి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: