రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న పారిశ్రామిక వేత్త‌, రాజ‌కీయ దిగ్గ‌జం. అయితే, ఇప్పుడు ఆయ‌న ప‌క్క‌న కూర్చుని త‌న స్థానంలో త‌న కుమారుడిని రంగంలోకి దింపుతున్నారు. అదేస‌మయంలో త‌న ఫ్యామిలీ నుంచి త‌న సోద రుడు రాయ‌పాటి శ్రీనివాస్‌కు కూడా రాజ‌కీయంగా భ‌విష్య‌త్తు చూపించాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ లాడుతున్నారు. ఈ క్ర‌మం లోనే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్య‌ర్థుల ఎంపిక కూడా వ‌డివ‌డిగా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే రాయ‌పాటి ఫ్యామిలీ నుంచి ఆయ‌న సోద‌రుడు రాయ‌పాటి శ్రీనివాస్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు టికెట్ విష‌యం క‌న్ఫ‌ర్మ్ కాక‌పోయినా.. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా ఆయ‌నకు టికెట్ ల‌భిస్తుంద‌నే ప్ర‌చారం మాత్రం జ‌రుగుతోంది.
Image result for rayapati srinivasa rao

టికెట్ ఇచ్చేందుకు ప్ర‌ధాన కార‌ణం.. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం, అన్న‌గారైనా రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు స‌మాజం లో మంచి ప‌లుకుబ‌డి కూడా ఉండ‌డం వంటివి క‌లిసివ‌స్త‌న్నాయి. అయితే, శ్రీనివాస్‌కు ఉన్న ప‌లుకుబ‌డి ఏంటి? అని చూస్తే.. మాత్రం జీరోగా క‌నిపిస్తోంది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచింది లేదు. ఎక్క‌డా  ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది కూడా లేదు. త‌న వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డంలోనే రాయ‌పాటి శ్రీనివాస్ స‌మ‌యం గ‌డిచిపోతుం డ‌డం  గ‌మ‌నార్హం. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాయ‌పాటి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం, ఆయ‌న కుమారుడు ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీకి సిద్ద‌ప‌డుతుండ‌డం తెలిసిందే. అయితే, త‌న హ‌వా పోయినా.. త‌న ఫ్యామిలీ రాజ‌కీయాలు రాష్ట్రంలో సాగాల‌ని రాయ‌పాటి ఆశిస్తున్నారు. 
Image result for rayapati srinivasa rao

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న‌కుమారుడికి, అదేస‌మ‌యంలో త‌న సోద‌రుడికి కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం పెంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు.  దీంతో అందివ‌చ్చిన అవ‌కాశంగా ఆయ‌న ఎమ్మెల్సీ టికెట్‌ను వినియోగించుకోవాల ని నిర్ణ‌యించు కున్నారు. ఈ నేప‌థ్యంలో రాయ‌పాటి శ్రీనివాస్‌కు ప‌ట్ట‌భ‌ద్రుల కోటా నుంచి ఎమ్మెల్సీని చేయాల‌ని నిర్ణ‌యించ‌కున్నారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో రాయ‌పాటి మాట‌ను కాద‌న‌లేని ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో దాదాపు ఎమ్మెల్స టికెట్ ఖ‌రారైన‌ట్టే. కానీ, దీనిని గెలిచే స‌త్తారాయ‌పాటి శ్రీనివాస్‌కు వ్య‌క్తిగ‌తంగా ఉందా? అనేది సందేహం. ఆయ‌నకు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓడిపోయిన అనుభ‌వ‌మే త‌ప్ప.. గెలిచిన అనుభ‌వం ఎక్క‌డా లేదు. మ‌రి దీనిని గెలిపించాలంటే.. మ‌ళ్లీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావే రంగంలోకి దిగాల్సిన అవ‌స‌రం ఉందేమో? అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: