ఈ మద్య ఎన్నికల మానిఫెస్టోల పేరుతో కొన్ని సామాజిక వర్గాలపై వరాల మీద వరాలు ప్రకటిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమం లో జోకుల మీద జోకులు వెటకారాల మీద వెటకారాలు పేలుతున్నాయి. తాజాగా ఆయన తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కు సంబంధించి సినిమా రిలీజ్ లాగా “మానిఫెస్టో టీజర్ రిలీజ్” చేయటం జరిగింది.  

Image result for telangana election date 2018

కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు తన అభ్యర్థులను ప్రకటించక పోయినా, ఎన్నికల్లో తాము గెలిచి అధికారం లోకి వస్తే ఏమేం చేస్తామో నన్న విషయం పై హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అభ్యర్ధులను ప్రకటించటానికి సత్తా లేని వాళ్ళు ఎన్నికల హామీలు ఇస్తున్నవిషయం పెద్ద జోక్ గా మారింది. అన్నీ పార్టీలకు ఎన్నికల హామీలు మానిఫెస్టోల మాటలు “గాలి మాటలో లేదా గాలి మూటలో కాబట్టి ఎంతైనా వాగొచ్చు!  


105మంది అభ్యర్థుల్ని ప్రకటించినా, తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో? చెప్పేందుకు ఎలాంటి హామీలు ఇప్పటివరకు ఇవ్వలేదు గులాబీ దళాధిపతి. ఎందుకంటే ఇంతవరకు 2014లో ఇచ్చిన హామీలే నేరవేర్చలెదాయన. అంతే కాదు నల్ల తిప్పితే నీళ్ళు రాకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్లు అదగనన్న పెద్దమనిషి ఏ ముఖంతో ప్రజల దగ్గరకు వెళతాడు, ఓట్లడుగుతాడు? 

Image result for telangana election date 2018

దీంతో ప్రజల దగ్గరకు వెళుతున్న గులాబీ అభ్యర్థులు తాము చెప్పేందుకు ఏమీ లేదన్న మాటను అధినేత వద్ద మొరపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో హామీల మీద హామీలతో కాంగ్రెస్ ప్రజా సమూహాల్లో దూసుకెళ్లటం, కారు జోరు తగ్గిందన్నవాదనలతో పాటు, గులాబీలంటేనే ప్రజలకు వెగటుబుట్టిందని అంటున్నారు. ముందస్తుకు వెళ్లే తరుణాన కనిపించిన ఉత్సాహం గులాబి అధినేతలో సన్నగిల్లిన దాఖలాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. 


అయితే మహాకూటమి దెబ్బకు కలలు కరిగి, కేసీఆర్ వెంటనే అలెర్ట్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు తగ్గట్లే తాజాగా ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల్ని మాత్రమే రివీల్ చేసిన కేసీఆర్ భారీ హామీలు గుప్పించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకూ కాంగ్రెస్ చెబుతున్ననిరుద్యోగ భృతి ని అతిగా గేలిచేసిన టీఆర్ఎస్ అధినేత, ఇప్పుడు తాము కూడా ఇస్తామని చెప్పటమే కాదు, నిరుద్యోగ భృతి కింద ₹ 3016/- ఇస్తామని ప్రకటించారు.
Image result for different pensions in Telangana
వృద్ధులకునెలకు ₹ 2016/-, దివ్యాంగులకు పింఛనుగా  ₹ 3016/-కు పెంచుతున్నట్లుగా తన చదివింపులు ప్రకటించి సామాజిక మాద్యమంలో అభాసుపాలౌతున్నారు.   ప్రతి పథకానికి చివర్లో ₹ 16/-ఉండటం సోషల్ మీడియాలో వ్యంగాస్త్రాలు శరపరంపరగా తగుల్తున్నాయి. కేసిఆర్ సారూ! ఈ ₹ 16/- తతంగమేందే? ఏదో పెళ్ళి చదివింపు ల్లాగా? అన్న ప్రశ్నను కొందరు వేస్తుంటే, మరి కొందరు ఎన్నికల వేళ, కేసీఆర్ సారు! ప్రజలకు చెల్లిస్తున్న జీఎస్టీ బ్రదర్! అంటూ వ్యాఖ్యలు చేసుకోవటం కనిపిస్తోంది. 


ఇంకొందరైతే చూస్తుంటే, తనకు అదృష్ట సంఖ్యగా భావించే ‘ఆరు’ సంఖ్య చివర్లో వచ్చేలా జాగ్రత్త పడ్డారని యెటకారం చేస్తున్నారు. ఉత్త ఆరు అయితే బాగుండదని పద హారు చేశారన్నమాటకు, అదేదో నూట పద హార్లు చేస్తే నైనా బాగుండేది కదా సారూ! అంటున్నారు పలువురు. పదహారు అయితే ఓకే కానీ, దానికి అదనంగా వంద చేరితే, మొత్తంగా వేలాది కోట్లభారం అదనంగా పడే అవకాశం ఉందని, అందుకే, పదహారుకు పరిమితం చేసి ఉంటారన్నసెటైర్లు వినిపిస్తున్నాయి. 
Image result for different pensions in Telangana
ఏమైనా కేసీఆర్ అదృష్టసంఖ్యగా భావించే ఆరు మరోసారి ఆసక్తికరచర్చకు తెరలేపటం అందరి జోకులకు కారణమైందని చెప్పకతప్పదు. అయితే తెలంగాణా ముందస్తు ఎన్నికల తేదీ ఏడు కావటం కెసిఆర్ కు ఏడుపు తెస్తుందేమో? అంటున్నారు. అయితే తెలంగాణ లో ఒకే ఇంటి నుండి ఐదుగురు సభ్యులు పదవులు పంచు కుంటున్న దరిమిలా ఎక్కడికెళ్ళినా వీళ్ళ కుటుంబానికైనా ఓట్లెయ్యకుండా టీరెస్ ను గెలిపించాలనే ప్రజాభిప్రాయానికి గుర్తుగా ప్రజల ఏడుపును గమనించి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రజల ఏడుపు గుర్తుగా ఏడుపును ఏడవ తేదీగా ఖరారు చేశారంటున్నారు జనం సెటైరిక్ గా!  ఎన్నికలతేదీ 07-12-2018తిధుల ప్రకారం అమావాస్య కూడా కేసిఆర్ కు మంచిదికాదట!

Image result for telangana election date 2018

మరింత సమాచారం తెలుసుకోండి: