తిత్లీ తుపాను కాదు కానీ మరో వైపు రాజకీయ తుపాను బయల్దేరింది. నాయకులు ఒకరొకరు వచ్చి ఓదారుస్తున్నారు. అంతేనా హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని టీడీపీ నాయకులు అంటూంటే అసలు సహాయమే లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో బాధితులు మరింతగా  బాధ పడుతున్నారు.


బాబు విఫలం :


తితిలీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా చేతులెత్తేశారని వైసీపీ విమర్శిస్తోంది. ఆ పార్టీ తరఫున మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ జిల్లావ్యాప్తంగా పర్యటించి నివేదికను జగన్ కి అందించింది. తిత్లీ తుపాను వల్ల మొత్తం పది నియోజకవర్గాలకు గానూ 8కి పైగా తీవ్రంగా నష్టపోయాయని ఆ పార్టీ నాయకులు ధర్మాన, బొత్స సత్యనారయణ తెలిపారు. ఇంతవరకూ ఆ గ్రామాలను ఆదుకునే నాధుడే లేడని అంటున్నారు.


జగన్ వస్తున్నారు:


మరో వైపు తిత్లీ తుపాను బాధితులను పరమర్శించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించిన సంగతి విధితమే. ఈ సమయంలో కూడా ఎక్కడా జగన్  సహనం  కోల్పోలేదు.అనుకున్నట్లుగానే  ఆయన షెడ్యూల్ మేరకు తిత్లీ తుపాను బాధితులను పరామర్శిస్తున్నారు. మరో పదిహేను రోజులల్లో జగన్ శ్రీకాకుళం జిల్లా అంతటా తిరిగి బాధితులను ఓదారుస్తారు. అలా  ఆయన పాదయాత్రను కూడా డిజైన్  చేసుకున్నారు. మొత్తానికి జగన్ త్వరలోనే రావడంతో ఆయన బాబు పై ఏ విధంగా మాటల తూటాలు పేలుస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: