ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం చినరాజప్పకు తృటిలో ప్రమాదం తప్పింది.  అయితే ఈ ప్రమాదం పెద్దది మాత్రం కాదు.   సాధారణంగా కొన్ని సార్లు ఆటవిడుపుగా సాగేది ప్రమాదాలకు దారి తీస్తుంది.  సాధారణంగా రాజకీయాల్లో ముఖ్య నేతలను కొన్ని కార్యక్రమాలకు ముఖ్యఅతిధులుగా ఆహ్వానిస్తుంటారు.  ముఖ్యంగా జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆటల పోటీలకు మంత్రుల స్థాయిలో ఉన్న వారిని పిలుస్తుంటారు. 

తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో రాజా ట్యాంక్ ఆవరణలో షటిల్‌ కోర్టును ప్రారంభించారు చినరాజప్ప.  అయితే ప్రారంభించినంత మాత్రన క్రేజ్ ఏముంటుందనుకున్నారో ఏమో కాసేపు ఆడాలని ప్రయత్నించారు.  అంతే షటిల్ ఆడుతూ ఓ షాట్ కొట్టబోయి, కాలుజారి బోర్లా పడిపోయారు.  కాలు జారి పడిపోయిన వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, పక్కనే ఉన్న తెలుగుదేశం నేతలు ఆయనను పైకి లేవదీశారు.

ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. తనకేమీ కాలేదని, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పిన చినరాజప్ప, ఆపై తన మిగతా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిపోయారు.  ఈ ఘటన కెమెరా కళ్లకు చిక్కాయి..ఇంకేముంది..ఒక్కసారే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఆ వీడియో మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: