కమల నాధులు మెల్లగా దారిలోకి వస్తున్నారు. డిల్లీ నుంచి ఏపీ వైపు చూస్తున్నారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయన్న ఆలొచనో మరేమో తెలియదు కానీ వారు మాత్రం తమ విధానలను కొంతవరకు తప్పు అని చెప్పకుండానే ఒప్పుకుంటున్నారు.


ఆలస్యమేనట :


కేంద్ర సాయం ఆలస్యమవుతుందంటే అంగీకరిస్తాం కానీ సాయమే చేయడం లేదంటే మాత్రం అంగీకరించమని బీపేపీకి చెందిన ఎమ్మెల్సీ ఫీవీఎన్ మాధవ్ అంటున్నారు. విశాఖలో ఈ రోజు విలెకరులతో మాట్లాడిన మాధవ్ తిత్లీపై కేంద్ర స్పందన అంతంతమాత్రంగా ఉందన్న మాటను కొట్టేస్తూనే లేట్ అయిందని  చెబుతున్నారు. అంటే అవ్వ పేరే ముసలమ్మ, మెల్లగా తప్పు ఒప్పుకున్నట్లే కదా అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.


బాబుకు ప్రచార యావ :


యధా ప్రకారం బాబు పైన బీజేపీ నేత మాటలతో విరుచుకుపడిపోయారు. బాబుకు అంశం ఏదైనా ప్రచారం మాత్రం ఎక్కడా తగ్గట్లేదని అన్నారు.  విపత్తును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారస్త్రంగా మార్చుకున్నారని  మాధవ్ పంచులేశారు.  తుఫాన్‌ను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు.



తొందరలోనే సాయం :


చాల తొందరలోనే  తితలీ తుఫాన్‌ నష్టం అంచనాకు త్వరలోనే కేంద్ర బృందం పర్యటిస్తుందని ఓ చల్లటి మాటను మాత్రం మాధవ్ చెప్పుకొచ్చారు. అదే విధంగా బాధితులను పూర్తిగా ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చారు. మొత్తానికి బీజేపీ నాయకులు ఇలా తప్పులు లేట్ గా అయినా తెలుసుకుని సరిదిద్దుకుంటే బాగుంటుందేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: