మేము సుద్ద పూసలం, అబద్దాలు, ఆర్భాటాలు  ఆసలు ఎరగం. అసలు మా బుర్రల్లో టన్నుల కొద్దీ మంచితనం తప్ప మరేం ఉండదు,  దొరకదు అంటున్నారు మంత్రి  కళా వెంకట రావు, మేమేం చేసినా జాతి జనుల శ్రేయస్సును ద్రుష్టిలో పెట్టుకుంటాం. ప్రతిపక్షాల్లా కాదంటూ సుద్దులు చెబుతున్నారు.


రాజకీయం వారిదట :


ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి కళా వెంకటరావు అంటున్నరు. వారికి ఎంతసేపూ అదే యావ తప్ప జనం గురించి ఆలొచించే ఓపికా, తీరిక వారికి లేనే లేవని ఒక్క ముక్కలో తేల్చేసారు. అసలు వారు నోరు విప్పితే అవాస్తవాలు చెబుతారంటూ అటాక్ చేశారు. వారి నుంచి ఒక మంచి సలహా వస్తుందని అనుకున్నాం కానీ రావడంలేదే అంటూ ఆవేదన కూడా చెందారు.


మేము జనం కోసమే :


ముఖ్యమంత్రి మొదలుకుని మేమంతా ఉన్నది జనం కోసమేనని మంత్రి గారు అంటున్నారు. మాకు అలాంటి చిల్లర రాజకీయాలు తెలియవు బాబూ అంటూ అమాయకం ముఖం పెట్టి మరీ చెబుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ అంతా తిత్లీ తుపాను బాధితులను ఆదుకుంటూంటే జగన్, పవన్ మాత్రం  టీడీపీ మీద రాళ్ళు వేస్తున్నరని కళా తెగ బాధ పడిపోతున్నారు.



వాళ్ళిద్దరికీ డిల్లీ స్క్రిప్ట్ ఉందట. అందువల్ల వాళ్ళు మోడీ డైరెక్షన్లో పనిచేస్తున్నారుట. నమ్మేద్ద్దమా కళా వారి మాటలు మరి. ఎంతైనా బాబు అడుగుల్లో అడుగు వేస్తున్న అనుంగు తమ్ముడు కదా అలాగే మాట్లాడుతారు లెండి.


మరింత సమాచారం తెలుసుకోండి: