ప్రస్తుత పరిస్థితుల్లో  ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఏకైక అంశం ఐటీ దాడులు..చంద్రబాబు ప్రభుత్వమే టార్గెట్ గా జరుగుతున్న ఈ దాడులు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించాయి. ఐటీ అధికారులు ఎప్పుడు తమ తలుపు తడుతారో తెలియక బిక్కు బిక్కు మంటూ ఉంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అయితే ఈ భయం కేవలం చంద్రబాబు కి ఆర్ధికంగా అండగా ఉండే నేతలకి మాత్రమే కానీ మిగిలిన వారు మాత్రం గుండెలపై చేతులు వేసుకుని పడుకోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది..ఇదిలాఉంటే

 Related image

ఇప్పటికే చంద్రబాబు ఆర్ధిక, అంతరంగిక కోటరీలుగా పేరున్న సుజనా చౌదరి, మంత్రి నారాయణ, సీఎం రమేష్ లాంటి వారిపై దాడులు జరిగాయి..వీరిలో అత్యంత భారీగా సొమ్ము ఎగ్గొట్టిన లిస్టు లో సీఎం రమేష్ ముందు వరుసలో ఉన్నారు దాదాపు 100 కోట్ల మేర డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళింది.ఎవరు వద్దకి వెళ్ళింది అనే కూపీ ఇప్పటికే లాగేసిన అధికారులు త్వరలో సీఎం రమేష్ అరెస్ట్ కి రంగం సిద్దం అనేస్తున్నారట..రమేష్ అరెస్ట్ తధ్యం అనే వార్తలు ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి..ఇక మరొక ట్విస్ట్ ఏమిటంటే..

 Image result for cm ramesh it raid

ఈ దాడులు సైలెంట్ అయ్యాయి ఇక మనకి పరవాలేదు అనుకున్న కొంతమంది నేతలకి అసలు సిసలు సినిమా చూపించనున్నారట ఐటీ అధికారులు..త్వరలో బాబు కి కోటరీలో ఒకరిగా పేరున్న , మంత్రి పదవి లేకున్నా మంత్రి కన్నా ఎక్కువగా అందరూ ఆదరించే ఒక ఎమ్మెల్యే చుట్టూ ఐటీ ఉచ్చి బిగుస్తోందట. సదరు ఎమ్మెల్యే గుంటూరు జిల్లాకి చెందిన ఎమ్మెల్యే గా ఉన్నారని తెలుస్తోంది..ఎలాంటి శాఖలో ప్రమోషన్స్ కావాలన్నా ఆ శాఖ మంత్రి వద్దకి వెళ్ళనవసరం లేదట..ఏకంగా సదరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి చదివింపులు ఇచ్చుకుంటే పని అయిపోతుందనే టాక్ కూడా ఉంది..

 

అంతేకాదు ఎమ్మెల్యే కాక మునుపు ఉన్న ఆస్తులు కంటే కూడా ఈ మధ్యకాలంలో ఆయన గారి సంపాదన వందల కోట్లకి చేరుకుందని టాక్ కూడా ఉంది. మరి త్వరలోనే దాడులు ఆయనపై జరుగుతాయని ఊహించాడో ఏమో కాని కొన్ని రోజుల క్రిందట సదరు ఎమ్మెల్యే గారు అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకున్నారట అయితే ఎమ్మెల్యే ఇలాంటి తెలివితేటలూ ప్రదర్శిస్తాడని ముందే పసిగట్టిన అధికారులు...సదరు ఎమ్మెల్యే విషయంలో గత రెండు నెలలుగా మాటు వేసి ఉంచారట. త్వరలోనే ఆయన ఆస్తులపై కూడా ఐటీ దాడులు తప్పవనే టాక్ జోరుగా వినిపిస్తోంది..మరి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: