ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణాలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు దుమ్మె త్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని ఎన్నో క‌ల‌లు కంటున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సెంట్రి క్‌గా వ్యూహాత్మ‌కంగా దాడిని ముమ్మ‌రం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ ఓటు బ్యాంకును కేసీఆర్‌కు దూరం చేయాల ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే తాజాగా రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌లోనూ ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించా రు. దేశం మొత్తం అంబేద్కర్‌ బాటలో నడుస్తుంటే ఆయన పేరెత్తడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టపడటం లేదని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వ పథకానికి అంబేద్కర్‌ పేరు పెట్టలేద న్నారు. కేసీఆర్‌కు అంబేద్కర్‌ పేరు నచ్చలేదని చెప్పారు. 

Image result for telangana

ఈ క్ర‌మంలోనే రాహుల్ మ‌రింత తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్క‌ర్‌ పేరు తీసేశారని తెలిపారు. ఇది అంబేద్కర్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో టీఆర్‌ఎస్‌ సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. అవినీతితో కేసీఆర్‌ కుటుంబం కోట్లు దండుకుంటోందని ఆరోపించారు.
Image result for congress
తెలంగా ణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చారా అని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎంత మందికి వచ్చాయని అడిగారు. ప్రాజెక్టుల పేరు మార్చి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులు, ఆదివాసీల కోసం తాము తెచ్చిన పథకాలను పక్కన పెట్టారని పేర్కొన్నారు. అడవులపై గిరిజనులకు తాము పూర్తి హక్కులు కల్పించామని చెప్పుకొచ్చారు.
Image result for trs

మొత్తానికి ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తే.. తెలంగాణాలో కేసీఆర్‌కు ఎస్సీ వ‌ర్గా ల‌కు మ‌ధ్య దూరం పెంచేందుకు రాహుల్ చేసిన ప్ర‌యోగం స‌క్సెస్ అయ్యేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆది లాబాద్‌లో ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు ఎక్కువ‌. ఈ నేప‌థ్యంలో వీలు చూసుకుని కేసీఆర్‌ను భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని అంటున్నా రు. నిజానికి కేసీఆర్ కూడా ఎస్సీల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇచ్చింది లేదు. పైగా ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌ల‌తో తీసుకున్న నిర్ణ‌యాలు కూడా ఎస్సీ వ‌ర్గానికి మేలు క‌న్నా కీడు చేశాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇంకేముంది హైద‌రాబాద్‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హం నిర్మిస్తామ‌ని చెప్పిన కేసీఆర్ ఆ త‌ర్వాత ఆ విష‌యాన్ని కూడా ఆయ‌న మ‌రిచిపోయారు. ఇదీ ఇప్పుడు తెలంగాణాలోకేసీఆర్ ప‌రిస్థితి. 



మరింత సమాచారం తెలుసుకోండి: